Just In
- 5 min ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
- 8 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అది ముగిసింది ఇది దొరికింది.. చమ్మక్ చంద్ర లక్ ‘అదిరింది’
సినిమాల్లో ఎన్నో యేళ్ల నుంచి ఉండి చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా రాని గుర్తింపును జబర్దస్తో షో తీసుకొచ్చింది. అలా ఎంతో మంది ఆర్టిస్ట్‌లు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకడు. జబర్దస్త్ షోలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నాడు. అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే ఆర్టిస్ట్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి చమ్మక్ చంద్ర జబర్దస్త్ షోను వీడిపోయాడు.

బాగానే సెటిల్..
జబర్దస్త్ షోలో సంపాదించిన వాటితో చమ్మక్ చంద్ర బాగానే సెటిల్ అయ్యాడు. సొంతంగా ఇళ్లు, కారు కొనుక్కుని మంచిస్టేజ్‌లో ఉన్నాడంటూ నాగబాబు ఆ మధ్య చెప్పుకొచ్చాడు. అలా జబర్దస్త్ షోలో సంపాదించిన, ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగానే అదిరిందిలో తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఓరచూపుతో కాల్చేస్తోంది.. దివ్యా గణేష్ పిక్స్ వైరల్

నాగబాబు కోసం..
జబర్దస్త్ షోలో మంచి స్థాయిలో ఉన్న చమ్మక్ చంద్ర.. నాగబాబు కోసం వీడాడు. అలా అదిరింది షోలోకి వెళ్లిన చంద్రకు అక్కడా మంచి రెమ్యూనరేషనే దక్కిందని తెలుస్తోంది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అదిరింది షో ఇప్పుడు ప్రసారం కావడం లేదు.

అలా మారినా కూడా..
అదిరింది షోని బొమ్మ అదిరిందిగా మార్చారు. యాంకర్లు, జడ్జ్‌లను అందరినీ మార్చేశారు. అలా బొమ్మ అదిరింది కొన్ని వారాలు బాగానే నడిచింది. కానీ రేటింగ్‌లు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. దీంతో చెప్పా పెట్టకుండా బొమ్మ అదిరింది బిచానా ఎత్తేసింది.

అలా మిగిలిపోయారు..
బొమ్మ అదిరింది అలా సడెన్‌గా మూత పడటంతో అందరూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నాగబాబు మొదటి నుంచి ఇది పసిగట్టి తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే ఫేమస్ చేసుకున్నాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం ఏం చేయాలో తోచక అలా ఉండిపోయారు. మళ్లీ తిరిగి ఈటీవీలోకి, జబర్దస్త్ లోకి వెళ్లలేరు.

ఆ కొత్త షోలో..
స్టార్ మాలో ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ముందు పెట్టి కామెడీ స్టార్స్ అనే కొత్త షోను ప్రారంభించారు. ఇందులో అదిరింది కంటెస్టెంట్లు మొత్తం ఇందులో వాలిపోయారు. అలా చమ్మక్ చంద్రకు మళ్లీ ఆదాయం వచ్చినట్టైంది. అలా అదిరింది ముగిసిపోవడం ఇలా కొత్త షో ప్రారంభం కావడమంటే చంద్రది అదృష్టమే. మరి ఈ షో ఎంత కాలం ఉంటుందో చూడాలి.