»   » జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పై కేసు నమోదు

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమెడియన్ ముక్కు అవినాష్ పై పోలీస్ కేసు నమోదైంది. శివరాత్రి పండుగ రోజున ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడంటూ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ పై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 10 వేలు కూడా అడ్వాన్స్ గా తీసుకున్నాడని... ప్రోగ్రామ్ కు మాత్రం రాలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో జబర్దస్త్ పాపులర్ అయినంతగా మరే కామెడీ షో కూడా పాపులర్ కాలేదు. నాగబాబు, రోజా జడ్డిజలుగా, అనసూయ, రష్మి యాంకర్లుగా.... వివిధ కామెడీ టీమ్స్ తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు.

జబర్దస్త్ ప్రోగ్రాంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న కమెడియన్స్ ఇప్పుడు స్టార్స్ గా మారారు. బోలెడంత క్రేజ్ తో పాటు ఒక్కొక్కరిగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంతగా పాపులర్ అయిన వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నా అక్కడ జబర్దస్త్ బ్యాచ్ ప్రత్యక్షమవుతుంది. అయితే ఇంత పాపులారిటీ తెచ్చుకుంటున్న కమేడియమ్న్లు కొన్ని సార్లు వివాదాల్లో ఇరుక్కోవటం కూడా మామూలే అయ్యింది.

Cheating case filed on Jabardasth Comedian Avinash

గతంలో 'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు 'జబర్దస్త్' టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, 'జబర్దస్త్' షోపై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 2014లో ప్రసారమైన ఓ ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. aa కేసు నుండి ఇటీవలే నాగబాబు, రోజా, రష్మిలకు విముక్తి రాగా, తాజాగా ముక్కు అవినాష్ పై కేసు నమోదు కావడంతో, మరోసారి 'జబర్దస్త్' పేరు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
jubilee hills police Filed Cheating case on Jabardast comedian mukku Avinash
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu