For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Suma Adda: మరోసారి బుల్లితెరపైకి చిరంజీవి.. సుమతో కలిసి సందడి.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!

  |

  స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బడా స్టార్‌గా ఎదిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకోవడంతో పాటు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'తో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

  ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి

  ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి

  టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

  ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

  సంక్రాంతికి మూవీ.. ఫైనల్ కాపీ

  సంక్రాంతికి మూవీ.. ఫైనల్ కాపీ

  మెగాస్టార్ చిరంజీవి - మాస్ హీరో రవితేజ కలయికలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయి. తాజాగా ఫైనల్ కాపీని కూడా చిత్ర యూనిట్ చూసేసింది. ఇక, ఈ మూవీ 2 గంటల 40 నిమిషాల నిడివితో రిలీజ్ కాబోతుంది.

  ప్రమోషన్స్.. ఈవెంట్ డేట్ ఫిక్స్

  ప్రమోషన్స్.. ఈవెంట్ డేట్ ఫిక్స్

  ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని దర్శకుడు బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఇక, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే 7వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు.

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  మరోసారి బుల్లితెరపై మెగాస్టార్

  మరోసారి బుల్లితెరపై మెగాస్టార్

  మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నా వాటికి సరైన ఫలితాలను మాత్రం అందుకోలేకపోతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'వాల్తేరు వీరయ్య' మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికోసం ఆయన ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా దీనిపై ప్రకటన వచ్చింది.

  సుమ అడ్డాకి రాబోతున్న చిరు

  సుమ అడ్డాకి రాబోతున్న చిరు

  తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా చక్రం తిప్పుతూ.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తనకు తానే సాటి.. తనకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా దూసుకుపోతోంది సుమ కనకాల. ఆమె ఇప్పుడు 'సుమ అడ్డా' అనే కొత్త షోతో రాబోతుంది. జనవరి 7వ తేదీ నుంచి ప్రతి శనివారం రాబోతుంది. ఇప్పుడీ షోలోకే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో కలిసి వచ్చినట్లు తెలిసింది.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  మాస్ మూలవిరాట్ అని పోస్ట్

  మాస్ మూలవిరాట్ అని పోస్ట్

  సుమ కనకాల హోస్టింగ్‌తో సరికొత్తగా రాబోతున్న 'సుమ అడ్డా' గేమ్ షోకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్న విషయాన్ని మల్లెమాల యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఆయనకు సుమ స్వాగతం పలుకుతూ ఫ్లవర్ బొకే ఇచ్చిన ఫొటోను షేర్ చేసిన షో యూనిట్.. 'మాస్ మూలవిరాట్ చిరంజీవి సుమ అడ్డా షో కోసం విచ్చేశారు' అని అందులో పేర్కొంది.

  ఆరోజే ప్రసారం కాబోతుంది

  ఆరోజే ప్రసారం కాబోతుంది

  మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చిన 'సుమ అడ్డా' షో ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కాబోతుందన్న దానిపై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్ జనవరి 14వ తేదీన ప్రసారం కానుందని తెలిసింది. ఇక, 7వ తేదీన ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో సంతోష్ శోభన్ 'కల్యాణం కమనీయం' మూవీ యూనిట్ సందడి చేయబోతుంది.

  English summary
  Anchor Suma To Starts Suma Adda Show in ETV From January 7th. Chiranjeevi Graces This Show. Now Their Photos Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X