»   » చిరంజీవికి షాకిచ్చిన జోష్ రవి... వీడు అసాధ్యుడే.. సింప్లీ సూపర్బ్..

చిరంజీవికి షాకిచ్చిన జోష్ రవి... వీడు అసాధ్యుడే.. సింప్లీ సూపర్బ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువతరం హీరోలందరికీ మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్యుడు, స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదేమో. యువ నటుల బాడీ లాంగ్వేజి చూస్తే చిరంజీవిని అనుకరించినట్టే ఉంటుంది. మెగాస్టార్‌ను అభిమానించే కొందరు తమ సహజశైలిని మార్చిపోతుంటారు. అచ్చు చిరంజీవిలానే వ్యవహరిస్తుంటారు. అదంతా మెగాస్టార్‌కు ఉన్న పవర్‌తోనే సాధ్యమైంది. కామెడీ యాక్టర్ నుంచి హీరోగా మారిన సునీల్, మరో కమెడియన్ జోష్ రవితోపాటు చాలా మందిని చిరంజీవి ఆవహించారా అనే అనుమానం కలుగుతుంది. ఇందంతా ఎందుకు చెప్పడం అంటే బుధవారం ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడులో జోష్ రవి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా మందికి జోష్ రవిలో ఇంత టాలెంట్ ఉందా అనే ఫీలింగ్ కలిగింది. అంతేకాకుండా చిరంజీవిని సైతం షాక్ గురిచేసింది. జోష్ రవి చేసిన స్కిట్లు చిరంజీవిని కన్నార్పకుండా చేసేలా చేశాయంటే మామూలు విషయం కాదు.

వారెవ్వా జోష్ రవి

వారెవ్వా జోష్ రవి

ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో చిన్న చిన్నపాత్రలతో జోష్ రవి ఉనికిని తెలియచేసుకుంటున్నాడు. అయితే బుధవారం మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్‌లో జోష్ రవిని చూసిన వారందరూ వారెవ్వా చిరంజీవిని మెప్పించే విధంగా అభినయించాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఐదు సన్నివేశాల్లో అదుర్స్

ఐదు సన్నివేశాల్లో అదుర్స్

చిరంజీవి నటించిన పునాదిరాళ్లు, చంటబ్బాయ్, అపంద్భాదవుడు, జగదేశ వీరుడు అతిలోక సుందరి, ఖైదీ నంబర్ చిత్రాల్లోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసి చిరంజీవిలా నటించాడు. ప్రతీ సన్నివేశంలో ఎక్కడ తడబాటు గురికాకుండా నటించడం అందర్ని ఆకట్టుకొన్నది. డైలాగ్ పరంగా, గెటప్ పరంగా చిరంజీవిని మరోసారి గుర్తు తెచ్చారు. హావభావాలు, డ్రస్సింగ్‌లో జోష్ రవిని చూసిన వారు ఆయనలో మరో చిరంజీవి ఉన్నాడని గుర్తించారు.

కనురెప్ప వాల్చకుండా..

కనురెప్ప వాల్చకుండా..

మీలో ఎవరు కోటీశ్వరుడులో ఐదు రకాల పాత్రల్లో నటిస్తుండగా చిరంజీవి కనురెప్ప వేయకుండా చూడటం విశేషం. తానే నటిస్తున్నానా అనే భ్రమకు గురైనట్టు చిరంజీవి కనిపించారు. ప్రతీ సన్నివేశం పూర్తయిన తర్వాత చప్పట్లతో అభినందిస్తూ తన ప్రేమను, అనురాగాన్ని జోష్ రవిపై చిరంజీవి వ్యక్తం చేశాడు.

చిరంజీవి ఆలింగనం

చిరంజీవి ఆలింగనం

ఐదు పాత్రలకు సంబంధించిన సన్నివేశం పూర్తయిన వెంటనే చిరంజీవి తన సీట్లో నుంచి లేచి జోష్ రవిని ఆలింగనం చేసుకొన్నాడు. రవి ఇంతగా నన్ను సొంతం చేసుకొన్నావేంటి అని ఆనందంగా చిరంజీవి అభినందించారు. నీలో గొప్ప నటుడు ఉన్నాడు.. భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవడం తథ్యం అని ఆశీర్వదించాడు.

ఉద్వేగానికి లోనై.. కంటతడి..

ఉద్వేగానికి లోనై.. కంటతడి..

చిరంజీవి ప్రశంసల జల్లులో తడిముద్దైన జోష్ రవి ఉద్వేగానికి లోనయ్యాడు. ఉద్వేగానికి తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో రవిని చిరంజీవి ఓదార్చాడు. కంటి వెంట నీరు ధారగా కారుతుండగా చిరంజీవి తుడవడం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

ఈ రేంజ్‌లో ఉంటుందని..

ఈ రేంజ్‌లో ఉంటుందని..

జోష్ రవిని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ జోష్ రవి మంచి నటుడని నాకు తెలుసు. కానీ ఈ రేంజ్‌లో ప్రతిభ ఉందని నేను ఊహించలేదు. ఖైదీ నంబర్ 150 షూటింగ్ జరుగుతున్న సమయంలో జోష్ రవి గురించి నాకు రాంచరణ్ చెప్పాడు. ఏదైనా ఓ పాత్రను ఇద్దామా అనే అడిగాడు. కానీ ఎందుకో కదర్లేదు. పాత్ర దక్కకపోవడంపై జోష్ రవి బాధపడి ఉంటాడనుకుంటా. కానీ జోష్ రవిని మిస్ కావడం ద్వారా మేమెంతో కోల్పోయాం అని చిరంజీవి అన్నారు.

ఏమీ ఇచ్చినా తక్కువే

ఏమీ ఇచ్చినా తక్కువే

ఇంతటి ప్రతిభావంతుడికి ఏమి ఇచ్చినా తక్కువే. నా తరఫున ఓ చిన్న బహుమతిని కానుకగా ఇస్తున్నాను అని మొబైల్ ఫోన్‌‌ను అందించారు. ఈ సందర్బంగా చిరంజీవిని జోష్ రవి ఓ కోరిక కోరారు. మీ నోటి నుంచి నా గురించి చెబితే తన తల్లి సంతోషపడుతుంది అని అడుగగా ఎంతో ప్రతిభావంతుడైన అబ్బాయికి జన్మనిచ్చి సినీ పరిశ్రమకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అని చిరంజీవి అనడం గమనార్హం.

English summary
Actor Josh Ravi is huge fan of Chiranjeevi. He recently given a performance in Meelo Evaru Koteeshwarudu. By seeing Josh Ravi performace of few seens in his movies chirajeevi got shocked. chiranjeevi greeted good future for josh Ravi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu