సినీ స్టూడియోపై దాడి, హీరోయిన్ కారు ధ్వంసం
ముంబయి : ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఫిల్మాలయ్ స్టూడియోను శనివారం రాత్రి అజ్ఞాత యువకులు ధ్వంసం చేశారు. సూపర్ ఫైట్ లీగ్ టీవీ ధారావాహికను చిత్రీకరిస్తున్నప్పుడు ఈ సంఘటన సంభవించింది. మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) పార్టీ కార్యకర్తలే ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చునని సందేహిస్తున్నారు. ఈ విషయమై బాలీవుడ్ లో చాలా మంది ఇలాంటి సంఘటన ఊహించలేమని,షాక్ చెందామని చెప్తున్నారు.

ఆంబోలీలోని ఫిల్మాలయ్ స్టూడియోలో రాత్రి పాసులు లేకున్నా షూటింగ్ చూసేందుకు కొందరు యువకులు యత్నించారు. భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాసేపటికి 60 నుంచి 70 మంది యువకులు చొచ్చుకొని వచ్చి విధ్వంసం సృష్టించారు. భద్రతా సిబ్బందిని చితకబాదారు. ఆ సమయంలో స్టూడియోలో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఉన్నారు.
వీరి వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దుండగులు ఎమ్మెన్నెస్ కార్యకర్తలై ఉండవచ్చునని, అంతేకాకుండా చిత్రీకరణ కోసం కొంత సొమ్మును డిమాండ్ చేశారని రాజ్ కుంద్రా తెలిపారు. దీనికి నిరాకరించడంతో విధ్వంసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళతో అనుచితంగా వ్యవహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











