For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామెడీ షోలో నర్సులకు అవమానం, ధర్నాలు, యాంకర్ పై పోలీస్ కేసు

  By Srikanya
  |

  ముంబై: టీవి షోలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో జబర్దస్ద్ లో కామెడీ పేరుతో కొన్ని ఎపిసోడ్స్ ఎలా వివాదాస్పదమయ్యి, కోర్టుదాకా వెళ్ళాయో...హిందిలోనూ పాపులర్ కామెడీ షో కు అలాంటి సమస్యలు తప్పటం లేదు. కామెడీ చేస్తున్నామంటూ కొన్ని వర్గాలను కించపరచటం,వారి మనోభావాలు దెబ్బ తినటం సర్వసాదారణమైపోయింది. తాజాగా దేశంలోనే నంబర్‌ వన్ స్టాండప్‌ కమెడియన్‌, నటుడు కపిల్ శర్మ అలాంటి వివాదంలో ఇరుక్కున్నారు.

  కపిల్ శర్మ యాంకర్‌ కమ్‌ స్టాండప్ కమెడీయన్‌గా వచ్చే పాపులర్‌ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. హిందీ టీవీ రేటింగ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఈ షోలో తాజాగా నర్సును చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సులను దారుణంగా అవమానించేలా ఈ షోలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత్‌సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.

  ఆందోళనకు దిగిన నర్సులు మంగళవారం కపిల్‌ శర్మ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్‌-ఎంపీ నవజోత్‌ సింగ్‌ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు.

  comedian kapil sharma terms nurses as "loose character" and "easily available"

  అలాగే నర్సులంటే అంత చులకనా? నర్సులకు వ్యక్తిత్వం ఉండదని, వారిని సులువుగా లోబర్చుకోవచ్చుననే తప్పుడు పద్ధతిలో కపిల్‌ తన షోలో మమల్ని చూపించారని, అతనిపై వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకొని కేసు నమోదుచేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది.

  గతంలోనూ నర్సులను కించపరిచేలా కపిల్ శర్మ చూపించారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పంజాబ్ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్‌ శర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

  'ద కపిల్ శర్మ షో'లో నర్సు పాత్రలో కనిపిస్తున్న రొచెల్లె రావు వేసుకున్న నర్సు యూనిఫామ్‌ను కూడా అసభ్యంగా చూపిస్తున్నారని, ఈ షోలో తమను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  మరో ప్రక్క కపిల్ శర్మ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. 'ద కపిల్ శర్మ షో'తో తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడికి సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ప్రసారమైన ఈ కార్యక్రమం గురించి ట్విటర్ లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి.

  10 లక్షలకు పైగా ఇంప్రెషన్లు పెట్టారు.కపిల్ షో చూసి నవ్వు ఆపులేకపోయామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల్లో 1,08,000 కన్వర్జేషన్లు జరిగాయని ట్విటర్ ఇండియా హెడ్ విరాల్ జానీ తెలిపారు. ఇటీవల కాలంలో ఓ టీవీ కార్యక్రమం గురించి ఇంతమంది మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

  కాగా, తమపై కురిపించిన అభిమానానికి కపిల్ శర్మ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. కలర్స్ చానల్ లో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కలర్స్ చానల్ ఈ కార్యక్రమ ప్రసారం ఆపేయడంతో సోనీలో 'ద కపిల్ శర్మ షో'తో కపిల్ గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  English summary
  The newly-aired Kapil Sharma Show has landed right in controversy for its alleged derogatory portrayal of a relationship between a nurse and a doctor. Nursing staff from various medical colleges and hospitals staged protests against the show on Tuesday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X