Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
జానీ మాస్టర్‌ను దారుణంగా అవమానించారు.. సెటైర్లతో రెచ్చిపోయిన ధన్ రాజ్-వేణు!!
కమెడియన్స్ వేణు-ధన్‌రాజ్ ద్వయం కలిశారంటే అక్కడే ఏదో ఒక వివాదం చెలరేగాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే వీరద్దరి మూలానే కామెడీ షోలు, ఇలా స్కిట్స్ వేసే పద్దతి మొదలైందని చెప్పవచ్చు. బృందావనం ఆడియో ఫంక్షన్‌లో వీరిద్దరు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కవుట్ అవ్వడంతో జబర్దస్త్ కాన్సెప్ట్ వచ్చిందని, తమతోనే ఆ షో మొదలైందని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అలా వీరి ప్రయాణం బుల్లితెరపై మొదలై అనేక మలుపులు తిరిగింది.

అటు ఇటు..
వేణు, ధన్ రాజ్ ఇద్దరూ కూడా అటు వెండి తెర, బుల్లితెర.. బుల్లితెరలో మళ్లీ వేరే షోలు ఇలా తిరుగుతూనే ఉన్నారు. అలా జబర్దస్త్ షోలోనే ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అదిరిందిలో హాయిగా ఉన్నారు. ఇన్నాళ్లూ విడివిడిగా స్కిట్స్ చేసిన వీరిద్దరూ ప్రస్తుతం కలిసే చేసేందుకు సిద్దమయ్యారు.

భారీ మార్పులు..
అదిరింది షోలో భారీ మార్పులు సంభవించాయని అందరికీ తెలిసిందే. యాంకర్లను తీసేసికొత్త యాంకర్‌ను, జడ్జ్‌ను కూడా మార్చేశారు. యాంకర్ రవి, భానుశ్రీలను తీసేసి శ్రీముఖిని పట్టుకొచ్చారు. జడ్జ్‌గా నవదీప్‌ను తీసేసి జానీ మాస్టర్‌ను పెట్టుకున్నారు. ఇలా అదిరిందిలో జరిగిన మార్పులపైనే వేణు ధన్ రాజ్ స్కిట్ చేశారు.

ఇద్దరూ కలిసి..
మామూలుగా
వేణు,
ధన్
రాజ్
విడివిడిగా
స్కిట్
చేసేవారు.
కానీ
అన్నీ
మార్పుల్లో
ఇది
కూడా
ఓ
మార్పే
అన్నట్టు
ఇద్దరూ
కలిసి
నవ్వించేందుకు
వచ్చారు.
అర్జెంట్‌గా
ఓ
కాంట్రవర్సీ
కావాలని
న్యూస్
ప్రజెంటర్‌గా
ఉన్న
వేణు
అడిగాడు.
ఇక
రిపోర్టర్
పాత్రలో
ఉన్న
ధన్
రాజ్
మాట్లాడుతూ
కాంట్రవర్సీ
కావాలంటే
మళ్లీ
నేను
మసాజ్
సెంటర్‌కు
వెళ్లాలి
అంటూ
తన
గతంపై
తానే
సెటైర్
వేసుకున్నాడు.

జానీ మాస్టర్‌పై కౌంటర్లు..
అలా రిపోర్టర్‌గా ఉన్న ధన్ రాజ్ జానీ మాస్టర్ దగ్గరకు వెళ్లాడు. ఆయన దగ్గరకే వెళ్లి జానీ మాస్టర్ ఎవరో తెలుసా? అని అడిగాడు. దూరం నుంచి వేణు అరుస్తూ అతనే మాస్టర్ అని హింట్ ఇచ్చాడు. లాక్ డౌన్‌లో ఆన్ లైన్ క్లాసులు పెట్టి ఫీజుల వసూల్ చేస్తున్నావా? అంటూ ఓ సెటైర్ ధన్ రాజ్ సెటైర్ వేశాడు. వేణు స్పందింస్తూ ఆయన ఆ మాస్టర్ కాదు డ్యాన్స్ మాస్టర్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Recommended Video

అలా అవమానించేశాడు..
వేణు అంత క్లారిటీగా చెప్పినా కూడా ధన్ రాజ్ మళ్లీ జానీ మాస్టర్ అడుగుతూ.. ఓ డ్యాన్స్ మాస్టరా? అంటే ఏం చేస్తారు అని మరో కౌంటర్ వేశాడు. ఓహో ఏ పాటకైనా స్టెప్పులేస్తారా? అని ధన్ రాజ్ అడిగాడు. హా అంటూ జానీ మాస్టర్ కూడా మంచి ఊపుతో వచ్చాడు. స్టేజ్ మీదకు వచ్చి మంచి ఊపున్న స్టెప్పులు వేద్దామని రెడీ అయ్యాడు అంతలో కరోనా రింగ్ టోన్‌ను ప్లే చేయడంతో షాక్ అయ్యాడు. అలా జానీ మాస్టర్‌ను సెటైర్లతో దారుణంగా అవమానించేశారు. మొత్తానికి ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఏడిపించేశారంటే పూర్తి ఎపిసోడ్‌లో ఇంకెంత రచ్చ చేశారో.