»   » టీవో షోలో తాగి వచ్చి, బూతులు పంచాంగం.. సీనియర్ నటిపై,ఛానెల్ పై కంప్లైంట్

టీవో షోలో తాగి వచ్చి, బూతులు పంచాంగం.. సీనియర్ నటిపై,ఛానెల్ పై కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరువనంతపురం: ఇప్పటికే చాలా సార్లు వివాదాల్లో ఇరుకున్న ప్రముఖ నటి ఊర్వశి పై రెండు కంప్లైంట్స్ నమోదు అయ్యాయి. కైరాలి ఛానెల్ కోసం ఆమె నిర్వహిస్తున్న జీవితం సాక్షి పోగ్రామ్ పై వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై ఓ మహిళ కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు రిజిస్టర్ చేసింది.

ఊర్వశి నిర్వహించే పోగ్రామ్ లో తమ కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తున్నారని, తన భర్య తమ కుటుంబంలోని సమస్యలను, ఊర్వశి ఆధ్వర్యంలో నడిచే టెలివిజన్ టాక్ షోలో బయిటపెట్టి పబ్లిసిటి చేస్తున్నారని ఆమె కంప్లైంట్.

ఈ పోగ్రామ్ వలన తాము చాలా అవమానానికి గురి అయ్యాయమని, తమ కుటుంబం రోడ్డుపై పడ్డట్టలు అయ్యిందని, తాము బయిట సమాజంలో తిరగలేని విధంగా తమ గురించి ఆ పోగ్రామ్ లో డిస్కస్ చేసారని, తమ వ్యక్తిగత జీవితాలను బహిరంగంగా డిస్కస్ చేసారని ఆరోపించారు.

కమెండో భార్య

కమెండో భార్య

ఊర్వశిపై కంప్లైంట్ చేసిన ఆమె ఓ గౌరవనీయమైన కుటుంబానికి చెందినవారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో పనిచేసే తన భర్తతో విభేధాలు ఉన్నాయి. ఈ విషయమై ఈ పోగ్రామ్ లో ఊర్వశి ఆధ్వర్యంలో చర్చ జరిగింది.

తనదే న్యాయం అంటూ

తనదే న్యాయం అంటూ

ఆమె భర్త కొంతకాలంగా ఆమె నుంచి, పిల్లలనుంచి విడిపోయి ఉంటున్నాడు. అంతేకాకుండా భరణం ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే ఈవిషయమై తనదే న్యాయం అంటూ తన భార్యపై ఆరోపణలు చేస్తూ టీవి ఛానెల్ పోగ్రామ్ కు వెళ్లాడు.

ఆరోపణలు చేసాడు

ఆరోపణలు చేసాడు

ఆ షోలో తనపైనా, తన పిల్లలపైనా, తన కుటుంబంపైనా నోటికొచ్చినట్లు అర్దంలేని ఆరోపణలు చేసారని, దానికి ఊర్వశి కామెంట్స్ చేసారని, అసలు తమ పర్శనల్ లైఫ్ ని అలా పోగ్రామ్ గా చేసే అధికారం ఎవరిచ్చారని ఆమె నిలదిస్తున్నారు.

ఇలా చేయటం పద్దతి కాదు

ఇలా చేయటం పద్దతి కాదు

ఇలా టీవి ఛానెల్ వారు ఇలాంటిపోగ్రామ్ లు చేసి తమ వ్యక్తిగత జీవితాలను అస్తవస్తం చేయటం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పోగ్రామ్ లు ప్రసారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని, ఈ పోగ్రామ్ మరింత మందికి బాధాకరంగా తయరయ్యేలోగా ఆపాలని ఆమె కోరుతున్నారు.

హ్యూమన్ రైట్స్ వారు రంగంలోకి

హ్యూమన్ రైట్స్ వారు రంగంలోకి

ఈ పోగ్రామ్ ని సరిగ్గా నిర్వహించటం లేదని, రకరకాల అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి ఆ కంప్లైట్ లో ఆరోపణలు ఉన్నాయి. కేరళ హ్యూమన్ రైట్స్ కమీషన్ వారు ఈ కంప్లైంట్ ని అందుకున్నారు. అందులో ఊర్వసి...పోగ్రామ్ లో పాల్గొనటానికి వచ్చినవారితో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుందని ఉంది.

మరో కంప్లైంట్

మరో కంప్లైంట్

ఇక ఊర్వశిపై మరో కంప్లైంట్ వచ్చింది. అందులో ఈ పోగ్రామ్ పాల్గొనేవారు ఆర్దికంగా బాగా వెనక పడ్డవారు , సమాజంలో గుర్తింపుకు నోచుకోని వారని , వారిపై ఆమె ప్రవర్తన దారణంగా ఉందని ఆ కంప్లైంట్ సారాంశం.

తగువులు తీర్చే

తగువులు తీర్చే

ఇక ఆ పోగ్రామ్ పూర్తిగా కుటుంబం సభ్యుల మధ్య వచ్చే తగువులను తీర్చటానికి ఉద్దేశించింది. కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటి వారి ఆధ్వర్యంలో ఈ సమస్యలను పరిష్కరిస్తారు. ఇక ఈ కేసుకు సంభందించిన విషయం డిసెంబర్ 9 న తేలనుంది.

న్యాయ వ్యవస్దపై...

న్యాయ వ్యవస్దపై...

ఇంతకీ ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరూ అంటే షెఫాన్. ఆయన రాయల్ కాద్వర్ ప్రొటక్షన్ ఫోరం ప్రెసెడెంట్. ఆయన ఈ పోగ్రామ్ ని చూసి ఆగ్రహం చెంది..ఆ పోగ్రామ్ లో ఊర్శశి..కంటిస్టెంట్స్ తో మిస్ బిహేయర్ చేస్తోందని, అలాగే భారతీయ న్యాయ వ్యవస్దపై ఇదొక మాకరీలాగ ఉందని ఆయన అన్నారు.

ఎందుకంత కోపం

ఎందుకంత కోపం

ఈ పోగ్రామ్ ముఖ్యోద్దోశ్యమైన కుటుంబాల్లోని సమస్యలను పరిష్కరించటం అనేది పోయి..వచ్చిన వారిని పోగ్రాం నిర్వహిస్తున్నవాళ్లు హ్యూమిలేట్ చేస్తున్నారని అన్నారు. అలాగే ఆర్దికంగా వెనకబడిన కంటిస్టెంట్స్ పై విపరీతమైన కోపం ప్రదర్శించటం, బూతులు తిట్టడం వంటివి చేస్తోందని అన్నారు.

మద్యం సేవించి వచ్చి

మద్యం సేవించి వచ్చి

ఈ పోగ్రామ్ కు ఊర్వశి తాగి వచ్చిందని ఈ కంప్లైంట్ లో ప్రధాన ఆరోపణ. అయితే ఈ విషయమై టీవి ఛానెల్ వాళ్లు కొట్టిపారేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆమె తాగి వచ్చిందనటానికి ఆధారాలు ఉన్నట్లుగా చెప్తున్నారు.

అర్హత ఎక్కడిది

అర్హత ఎక్కడిది

తాగి వచ్చి టీవీ ఛానెల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి, లో క్లాస్ వర్గాలను అవమానం చేయటానికి ఆమెకు అర్హత ఎవరిచ్చారు. ఆమె మాట్లాడుతూంటే న్యాయ వ్యవస్దను అవహేళన చేస్తున్నట్లుంది. కావాలంటే పోగ్రామ్ సీడిలు తెప్పించుకుని చూడవచ్చు అన్నారు.

టీవీ మేనేజ్మెంట్ సైతం..

టీవీ మేనేజ్మెంట్ సైతం..

ఈ విషయమై కంప్లైంట్ అందుకున్న హ్యూమన్ రైట్స్ పానెల్ యాక్టింగ్ ఛైర్మన్ పి. మోహన్ దాస్ వెంటనే..లీగల్ సర్వీసెస్ ఆధారిటి వారిని, టీవి మేనేజ్మెంట్ ని ఈ విషయమై ఓ నెలలోగా వివరణ ఇవ్వాలని కోరారు.

గతంలోనూ

గతంలోనూ

గతంలో కేరళ అసెంబ్లీ ఉమెన్ ఎంప్లాయిస్ వారు ఆర్గనైజ్ చేసిన ఓ పోగ్రామ్ కు ఆమెను పిలిస్తే తాగి వెళ్లింది. ఈ విషయమై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ వివాదం చల్లారక ముందే మరో వివాదంలో ఊర్వసి ఇరుక్కుంది.

వెంటనే ఆపుచెయ్యండి

వెంటనే ఆపుచెయ్యండి

ఈ పోగ్రామ్ ని వెంటనే ఆపమని, చట్టబద్దమైన అనుమతులు లేకుండా అలాంటి పోగ్రామ్ లు ఎలా నడుపుతారని, ప్రెవేట్ గా అదాలత్ వంటివి నిర్వహించరాదని హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆదేశించింది .

మనకు ఇక్కడ కూడా

మనకు ఇక్కడ కూడా

తెలుగు లో జీటీవీలో ప్రసారం అవుతున్న బ్రతుకు జట్కాబండి పోగ్రామ్ విషయంలోనూ ఇలాంటి కంప్లైంటే నటి గీతపై వచ్చింది. ఈ పోగ్రామ్ లో వారిఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తీర్పులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తన జీవితంలో ..

తన జీవితంలో ..

నటి ఊర్వశి పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే...మలయాళ నటుడు మనోజ్.కె.జయన్ ను ఇంతకు మునుపు వివాహం చేసుకున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది. మనోజ్ కు, ఊర్వశికి పొరపొచ్చాలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. దాంతో ఇలా తన జీవితమే చక్కదిద్దుకోలని ఆమె ఇలాంటి పోగ్రామ్ లకు వచ్చి ఏం చేస్తుందనే విమర్శలు ఆమెపై ఉన్నాయి.

కూతురుని దూరం చేసి, తాగుడు

కూతురుని దూరం చేసి, తాగుడు

తన మాజి భర్త గురించి, అతను పెట్టిన టార్చర్ గురించి ఊర్వశి ఏం చెప్పిందో ఇక్కడ చదవండి....

టార్చర్ పెట్టాడు, తాగుడు నేర్పాడు, నా కూతురుని దూరం చేసాడు: నటి ఊర్వశి

English summary
Kerala state human rights commission has received two complaints against actress Urvashi in connection with a Television programme. The show is based on disputes between family members, which are being solved in the presence of Kerala State Legal Services Authority. The date for the hearing of the matter is fixed for December 9.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu