»   » నోటి దూల...! భారత్ మీద విమర్శలకు పాక్ నటున్ని టీవీ సిరీస్ నుంచి గెంటేసారు

నోటి దూల...! భారత్ మీద విమర్శలకు పాక్ నటున్ని టీవీ సిరీస్ నుంచి గెంటేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

యురీ దాడి రెండు దేశాల మధ్యా మరో సారి గట్టి మంటే రాజేసింది. ఇరు దేశాల రాజకీయ మేధావులూ పావులు కదుపుతూంటే సామాన్య జనం మాత్రం ఒక దేశం అంటే మరొక దేశం మీద ఉన్న కోపం తో రగిలిపోతున్నారు. ఎవరి దేశం మీద వారికి భక్తి ఉండొచ్చు అంత మాత్రాన విచక్షణ కోల్పోతే... అందునా తప్పు తమదే అని తెలిసికూడా పిచ్చ వేశాలేస్తే ఏమౌతుందో అర్థమయ్యే లోపే పాకిస్థాన్ కి చెందిన నటుడు బ్రిటీష్ టీవీ సిరీస్ నుంచి తొలగించ బడటమే కాదు. జాతి వివక్ష వ్యాఖల కేసుక్లో బ్రిటన్ జైలు ఊచలు లెక్కబెట్ట బోతున్నడు.

ఉరి దాడి విషయం లో పాక్ ఒంటరిగా అవటమే కాక అంతా దుమ్మెత్తి పోస్తూంటే, తమ దేశాన్ని వేలెత్తి చూపిస్తుంటే బాధేసిందో ఏమో గానీ.. బ్రిటన్‌కు చెందిన పాక్ దేశీయుడు మార్క్ అన్వర్ తమ దేశానికి మద్దతుగా నిలుస్తూ ట్వీట్లు చేశాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే.. భారత్‌ను తిట్టిపోస్తూ కొన్ని ట్వీట్స్‌ పోస్ట్ చేశాడు. రాయడానికి వీల్లేని భాషలో అక్కసు వెళ్లగక్కాడు.అయితే ఆ మాటలు అక్కడి చట్టాల ప్రకారం జాతి విద్వేష వ్యాఖల కిందకి రావటం తో, అతని అరెస్టుకు రంగం సిద్దమవటమే కాదు. అన్వర్ నటిస్తున్న పాపులర్ టీవీ సీరియల్‌ నుంచి దర్శకనిర్మాతలు అతణ్ణి తొలగించేశారు. అతడి కామెంట్స్ తమను షాక్‌లోకి నెట్టాయని సీరియల్‌ను ప్రసారం చేసే ఐటీవీ ఛానల్ పేర్కొంది. "నీ సేవలు ఇక మాకొద్దు" అంటూ అన్వర్‌కు మెసేజ్‌ పంపినట్లు తెలిపింది.

"Coronation Street" actot Marc Anwar from UK sacked for racism after Twitter rant

'కొరొనేషన్ స్ట్రీట్' బ్రిటన్‌లో పాపులర్ సీరియల్. ఈ సీరియల్‌లో అన్వర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడి రాతలను 'సండే మిర్రర్' అనే పత్రిక ప్రచురించగానే సీరియల్ ఐటీవీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అన్వర్‌ను తొలగించేస్తూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. అప్పటికి వొంటిమీదికి తెలివి వచ్చి.. భారతీయులకి ఖమాపన చెప్పాడు.

ఆమోదయోగ్యం కాని రీతిలో ప్రవర్తించినందుకు చింతిస్తున్నానంటూ యూట్యూబ్‌లో క్షమాపణల సందేశం పోస్ట్ చేశాడు. కుటుంబం, ప్రజలు, స్నేహితులు, సహనటులు, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేలా ప్రవర్తించానని చింతించాడు. బ్రిటన్‌లోని భారతీయులందరీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నాడు. భారతీయులను కించ పరచడం తన ఉద్దేశం కాదంటూ వ్యాఖ్యానించాడు. కానీ బ్ర్టీష్ పోలీస్ అధికారులు మాత్రం మనోన్ని క్షమించేలా లేరు మరి...

English summary
Pakistan-born actor Marc Anwar has been fired from "Coronation Street" after allegedly posting "racially offensive" tweets about Indians
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu