అదోక బ్రోతల్ హౌస్.. ముద్దులు.. హగ్గులు.. బిగ్ బాస్ షోపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
CPI Narayana- Bigg Boss: సంచలన వ్యాఖ్యలు చేయటంలో ఎప్పుడూ ముందుండే వారిలో ఒకరు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మరోసారి ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ పైన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. గతంలో కూడా ఈ షోపై అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన, ఈసారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?
సీపీఐ నారాయణ ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఎందుకు బిగ్‌బాస్‌పై ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు?" అని యాంకర్ ప్రశ్నించగా, ఆయన దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.'మరో ప్రపంచం' సినిమా మూడు రోజులు మాత్రమే ఆడింది, 'దసరా బుల్లోడు' సినిమా 300 రోజులు ఆడింది. ఆ సినిమా నీతికి, ఈ సినిమా నీతికి తేడా లేదా? ఇప్పుడు బిగ్‌బాస్ షో చూసి అందరూ 'అద్భుతం, బ్రహ్మాండం' అంటున్నారు. కానీ, ఇది నిజంగా కరెక్ట్‌నా?" అంటూ ఆయన ప్రశ్నించారు.
'ఒక బంగ్లాలో రక్తసంబంధం లేని యువతీ యువకులను 100 రోజుల పాటు బంధించి, 'మీకు నచ్చినట్లు జీవించండి' అంటారు. దాన్ని చూసి బయట ప్రజలు ఏమనుకుంటారు? ఇది బ్రోతల్‌లా ఉందని అనిపిస్తుంది. కానీ, కొందరు దీన్ని 'సోషల్ ఎక్స్పెరిమెంట్' అంటున్నారు. ఇది హాస్యాస్పదం!" అని ఆయన ధ్వజమెత్తారు.

బ్రోతల్ హౌస్ అని పిలవడం తప్పా?
'బిగ్‌బాస్‌ను బ్రోతల్ హౌస్ అని పిలవడం తీవ్ర పదజాలం కాదా?" అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి నారాయణ సమాధానం ఘాటుగా ఇచ్చారు. 'మీకు ఆ పదం నచ్చకపోవచ్చు, కానీ నిజం చెప్పాలి. మీరు ఊహించండి.. ముక్కు మొఖం తెలియని వాళ్లను తీసుకెళ్లి ఓ ఇంట్లో పెడితే ఊర్లో వాళ్లు ఏమనుకుంటారు? కామన్ సెన్స్‌తో ఆలోచించండి... అది మన సంస్కృతికి సరిపోతుందా?" అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
నాగార్జునపై ఫైర్
బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునపై కూడా నారాయణ నేరుగా విరుచుకుపడ్డారు. "నాగేశ్వరరావు మహానటుడు... తెలుగు కళామాతకి ఆయన ముద్దుబిడ్డ. అలాంటి మహానటుడి వారసుడైన నాగార్జున ఎందుకు ఈ చెడు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. "నాగార్జున అనేక కళాత్మక సినిమాలు తీశారు, ప్రజల ఆదరణ పొందారు. ఇంత పేరూ, ప్రతిష్ఠ ఉన్న వ్యక్తి ఈ తరహా కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరించడం తగదని" ఆయన వ్యాఖ్యానించారు. "నైతిక విలువలు మీకు ఉన్నాయా? ఇలాంటి నీచమైన షో ద్వారా వచ్చే డబ్బులు అవసరమా?" అంటూ నాగార్జునను నేరుగా నిలదీశారు.
హీరోయిన్స్‌పై అవమానకర వ్యాఖ్యలు
నారాయణ తన ఆగ్రహానికి కారణాన్ని కూడా వెల్లడించారు. "బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే నాగార్జున ఓ కాంటెస్టెంట్‌కి మూడు హీరోయిన్స్ ఫోటోలు చూపించి, ఎవరికీ ముద్దు పెడతావు? ఎవరికీ డేట్‌కి వెళ్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? అని అడిగారు. ఇది ఏ రకమైన నీతి? ఇది మహిళా గౌరవానికి విరుద్ధం కాదా?'అంటూ ఆయన ప్రశ్నించారు. ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో అనైతిక విషయాలు జరుగుతున్నాయి. కొందరు బయటకు వచ్చి గర్భిణులయ్యారని, కొందరు విడాకులు తీసుకున్నారని, కొందరు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారని విన్నాం. ఈ కార్యక్రమం డబ్బు కోసమో, వ్యామోహం రిత్యాగానో చేసినా చివరికి సమాజానికి చెడు మార్గాన్ని చూపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మన కుటుంబ వ్యవస్థే నిజమైన పాఠం
నారాయణ ఇంకా మాట్లాడుతూ "బిగ్‌బాస్ షో ద్వారా 'సోషల్ బీయింగ్‌గా ఎలా ఉండాలో చూపిస్తున్నాం'అంటున్నారు. మన భారతీయ కుటుంబ వ్యవస్థనే ప్రపంచం గౌరవిస్తోంది. మనం నేర్చుకోవాల్సినది బయట దేశాలనుండి కాదు. మన సంస్కృతిని మార్చే ప్రయత్నం చేయకండి" అని హెచ్చరించారు.
"ఇది ఎంటర్టైన్‌మెంట్ కాదు, ఇది ఎరోటిక్ డ్రామా. కుటుంబాలు కలిసి చూడలేని స్థాయికి వెళ్లిపోయింది. గతంలో లైవ్ షో పెట్టినా, కంటెంట్ కోసం కొందరినే టార్గెట్ చేస్తున్నారు. ఇది తప్పు" అని పేర్కొన్నారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ బిగ్‌బాస్ కార్యక్రమం ప్రసారం అవుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యాపారంగా మారింది. సాంస్కృతిక విలువలు పణంగా పెట్టి, వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు.


Click it and Unblock the Notifications










