»   » చిన్న విషయానికే గొడవ పడి... ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ ఆత్మహత్య

చిన్న విషయానికే గొడవ పడి... ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బుల్లితెరకు చెందిన ప్రత్యూష బెనర్జీ, సాయి ప్రశాంతన్‌ ఈ ఏడాదే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బుల్లి తెర నటుడు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలు సరిగ్గా తెలియరాలేదు. కుటుంబ కలాహాలు, ముఖ్యంగా భార్య కుటుంబంతో విభేధాలే కారణం అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టీవి నటుడు కమలేశ్‌ పాండే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోనీ టీవీలో ప్రసారమయ్యే 'క్రైమ్‌ పెట్రోల్‌' షోలో కమలేశ్‌ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. అతను జబల్‌పూర్‌లోని ఇంట్లో తనను తాను ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కమలేశ్‌, ఆయన భార్య కుటుంబానికి మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

Crime Patrol actor Kamlesh Pandey commits suicide: Report

కమలేష్ భార్య సోదరి అంజనీ చతుర్వేది తన కుమార్తె పెళ్లి గురించి కమలేశ్‌తో చర్చించకపోవడం, కనీసం పెళ్లికి ఆహ్వానించకపోవడంతో ఆయన మనస్తాపం చెందారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

మద్యం సేవించి తొలుత ఇంట్లో గొడవపడిన కమలేశ్‌ తర్వాత తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు. వెంటనే తనను తాను కాల్చుకున్నారు. భయాందోళలకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
TV serial actor Kamlesh Pandey, who had played a police officer in Crime Patrol, committed suicide by reportedly shooting himself in Jabalpur in Madhya Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu