»   »  బుల్లితెర స్టార్ విలన్‌ మృతి

బుల్లితెర స్టార్ విలన్‌ మృతి

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Larry Hagman
  లాస్‌ ఏంజెల్స్ ‌: డల్లాస్‌ ధారావాహికలో జేఆర్‌ ఈవింగ్‌ విలన్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ల్యారీ హర్ట్‌మ్యాన్‌ శుక్రవారం మృతిచెందారు. ధారావాహిక ముగిసినా జేఆర్‌ పాత్రను చంపిందెవరు అనే దానిపై అప్పట్లో పలు పత్రికలు సైతం సర్వేలు నిర్వహించాయి. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ల్యారీ చికిత్స కొనసాగుతుండగానే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ''ల్యారీ కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. అందరినీ పలకరించారు. ఆయనది ప్రశాంత మరణం'' అని ల్యారీ సన్నిహితులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


  ''ల్యారీ హగ్‌మ్యాన్‌ అసాధారణ వ్యక్తి. ఆయన పోషించిన జేఆర్‌ ఈవింగ్‌ పాత్ర వినోద రంగం ఎప్పటికీ మరిచిపోదు'' అని టీవీ కార్యక్రమం కార్యనిర్వాహక నిర్మాతలు సింథియా సిడ్రే, మైఖేల్‌ రాబిన్‌ తెలిపారు. వ్యాపారంలో పోటీనిచ్చే వారినే కాదు తన భార్యను కూడా మోసం చేసే పాత్రలో 1978 నుంచి 1991 వరకూ 356 ఎపిసోడ్‌లపాటు ల్యారీ ప్రేక్షకులను అలరించారు.

  ''హలో డార్లిన్‌: టాల్‌ టేల్స్‌ ఏబౌట్‌ మై లైఫ్‌'' అని తన ఆత్మకథలో ఆయన అనేక అంశాలు పేర్కొన్నారు. జేఆర్‌ పాత్రను కాల్చిన తుపాకీ వెనక ఉన్నదెవరో చెబితే రూ.1.30 కోట్లు ఇస్తానన్న ఓ పబ్లిషర్‌ నుంచి ఆ మొత్తాన్ని తీసుకుని తప్పు సమాచారం కూడా ఇచ్చారు హగ్‌మ్యాన్‌. తర్వాత దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

  ధారావాహిక ముగిసినప్పటికీ చాలాకాలం పాటు ప్రేక్షకుల బుర్రకు పదను పెట్టిన ఆ తుపాకీ వెనకున్నది జేఆర్‌తో అక్రమం సంబంధం సాగించిన మరదలు పాత్రధారి క్రిస్టీన్‌. టెక్సాస్‌లో 1931 సెప్టెంబరు 21న ఆయన జన్మించారు. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోయారు. అనంతరం తల్లి మేరీ మార్టిన్‌తో కలిసి లాస్‌ ఏంజెలిస్‌ వచ్చేశారు. 'ద ఎడ్జ్‌ ఆఫ్‌ నైట్‌', 'ఐ డ్రీమ్‌ ఆఫ్‌ జెన్నీ' ధారావాహికల్లోనూ ఆయన నటించారు. కాలిఫోర్నియాలోని పీస్‌ అండ్‌ ఫ్రీడమ్‌ పార్టీలో ఆయన శాశ్వత సభ్యుడు.

  Read more about: tv died టీవీ మృతి
  English summary
  Larry Hagman, who created one of American television's most renowned villains in the amoral oilman JR Ewing of Dallas, died on Friday, the Dallas Morning News reported. He was 81. Hagman died at a Dallas hospital of complications from his battle with throat cancer, the newspaper said, quoting a statement from his family. He had suffered from liver cancer and cirrhosis of the liver in the 1990s after decades of drinking.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more