ఈ రోజు నుంచి DD-సప్తగిరిఛానెల్ లో...

ఈ సందర్భంగా సప్తగిరి ఛానల్‌లో సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 నుంచి ప్రసారం చేయనున్న నాలుగు ధారావాహికలను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ఐశ్వర్యకలశం, బృందావనం, శ్రీనివాసకళ్యాణం, మా ఆయన బంగారం ప్రసారం అవుతాయని వివరించారు. కొత్తగా ప్రసారం చేయనున్న ధారావాహికల్లో నటించిన నటీనటులతో పాటు నిర్మాతలు, దర్శకులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మరో ప్రక్క 'సప్తగిరి ఛానెల్'లో ఎప్పుడు ఏ ప్రోగ్రాం వస్తుందో, ఎప్పుడు ఏ ప్రోగ్రాంను చెప్పాపెట్టకుండా తీసేస్తారో చెప్పినవాళ్ళకు బహుమానం ప్రకటించవచ్చు అంటూ సెటైర్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ఈ సీరియల్స్ ఏమైనా మార్పులు తీసుకు వస్తాయేమో చూడాలని వీక్షకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











