For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ డిబేట్: బాబు గోగినేని మీద కౌశల్ భార్య నీలిమ ఫైర్!

  |

  బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ విషయంలో పలు వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కౌశల్ ఈ సీజన్ విజేతగా నిలవడం వెనక కౌశల్ ఆర్మీ మద్దతు ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. షో జరుగుతున్నన్ని రోజులు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా వారిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో ట్రోల్ చేయడం లాంటివి అప్పట్లో సంచలనం అయ్యాయి. చివరకు షో హోస్ట్ నాని కూడా కౌశల్ ఆర్మీ సెగ ఎదుర్కొన్నారు. మరో వైపు బాబు గోగినేని కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు.

  కౌశల్ బిగ్ హౌస్ షోలోకి రాకముందే ఆర్మీ ఏర్పాటు చేసుకున్నాడని, ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం దీన్ని నడిపించారనేది బాబుగోగినేని ఆరోపణ. అది పేయిడ్ ఆర్మీ ఆనే సంచలన కామెంట్స్ సైతం బాబు గోగినేని చేశారు. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌లో ఈ విషయమై డిబేట్ జరిగింది. ఇందులో కౌశల్, ఆయన భార్య నీలిమతో పాటు బాబు గోగినేని, కిరిటీ దామరాజు పాల్గొన్నారు.

   బాబు గోగినేని మీద నీలిమ ఫైర్

  బాబు గోగినేని మీద నీలిమ ఫైర్

  కౌశల్ ఆర్మీని అతడి కుటుంబ సభ్యులే డబ్బులిచ్చి రన్ చేశారనే బాబు గోగినేని ఆరోపణలపై కౌశల్ భార్య నీలిమ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించండి అంటూ భగ్గుమన్నారు.

  ఇట్ ఈజ్ ది మ్యాటర్

  ఇట్ ఈజ్ ది మ్యాటర్

  ప్రూప్ ఉందా? అనే నీలిమ ప్రశ్నకు బాబు రియాక్ట్ అవుతూ అది ఇక్కడ మ్యాటర్ కాదు అనడంతో నీలిమ ఆగ్రహంతో ఊగిపోయారు. అది మ్యాటర్ కాదని మీరు ఎలా అంటారు? ఇట్ ఈజ్ ద మ్యాటర్ అంటూ నీలిమ విరుచుకుపడ్డారు.

   కొన్ని వేల అకౌంట్స్ ఉన్నాయి

  కొన్ని వేల అకౌంట్స్ ఉన్నాయి

  ఈ రోజు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వేల కౌశల్ ఆర్మీ, కౌశల్ మండ పేజీలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కౌశల్ క్రియేట్ చేశారా? ఏదో ఫేస్‌బుక్ పేజీ పట్టుకుని కౌశల్ క్రియేట్ చేశారని ఎలా అంటారు? అంటూ నీలిమ ఫైర్ అయ్యారు.

  బాబుగారికి అలాంటి తెలియవేమో?

  బాబుగారికి అలాంటి తెలియవేమో?

  బాబుగారికి ఫేస్‌బుక్ ఆపరేట్ చేయడం చాలా కష్టం అనుకుంటా. అందులో ఎనీటైమ్ పేరు మార్చుకోవచ్చు. ఎవరు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా పేరు మార్చుకోవచ్చు. ఆ విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుసు. ఆయనకు తెలియదేమో... అంటూ కౌశల్ వ్యాఖ్యానించారు.

  మాకు అవన్నీ వద్దండీ, ప్రూఫ్ చూపండి

  మాకు అవన్నీ వద్దండీ, ప్రూఫ్ చూపండి

  మే 30వ తేదీ వరకు కౌశల్ గారు ఈ గేమ్ లోకి వస్తున్నట్లు ఆయనకే తెలియదు. అలాగే వేరే వారికి కూడా తెలిసే అవకాశం లేనట్లే... అని బాబు గోగినేని మాట్లాడుతుండగా నీలిమ కల్పించుకుని, మాకు ఇవన్నీ వద్దండీ మే నెలలో ఆర్మీ స్టార్ట్ అయింది అన్నారు. ప్రూఫ్ చూపండి అంటూ నిలదీశారు.

   యస్ మీరే ఆర్మీ స్టార్ట్ చేశారు

  యస్ మీరే ఆర్మీ స్టార్ట్ చేశారు

  నీలిమ అడిగే విధానంతో విసుగు చెందిన బాబు గోగినేని... యస్ మీరే ఆర్మీ మొదలు పెట్టారు అంటూ ఎదురు దాడి ప్రారంభించారు. మే 21వ తేదీన ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియంకుండా కౌశల్ ఆర్మీ ఎలా మొదలైంది అంటూ ఆయన ప్రశ్నించారు.

  నేను కిరిటీకి డబ్బులిచ్చానా?

  నేను కిరిటీకి డబ్బులిచ్చానా?

  కౌశల్‌కు ఆర్మీ ఫాం అవుతుందని ఆవిడకు ఎలా తెలుస్తుందండీ? హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ నిమ్మకాయ పిండితే ఆర్మీ ఫాం కావాలని ఆవిడ ఏమైనా చెబుతుందా? మీరరన్నట్లు కౌశల్ ఆర్మీ ఫాం అయిందనే అనుకున్నాం. లోపలికి వెళ్లిన తర్వాత నేను కిరిటీకి డబ్బులిచ్చి నువ్వు నా కళ్లలో నిమ్మకాయ పిండు అని చెప్పానా? అంటూ.... కౌశల్ మండ తన వాదన విపించారు.

  నన్ను ఒంటరిని చేసి ఆడుకోవడం వల్లే

  నన్ను ఒంటరిని చేసి ఆడుకోవడం వల్లే

  బిగ్‌బాస్ ఇంట్లో మీరంతా నన్ను ఒంటరిని చేసి ఆడుకున్నారు కాబట్టి కౌశల్ ఆర్మీ ఫాం అయింది... అని కౌశల్ మరోసారి డిబేట్లో నొక్కి వక్కానించారు. కౌశల్ ఆర్మీ మీరే క్రియేట్ చేశారనడానికి నా వద్ద చాలా ప్రూఫ్స్ ఉన్నాయంటూ బాబు గోగినేని... ఫేస్‌బుక్ పేజీలో అకౌంట్స్ క్రియేట్ అయిన తేదీలను చూపించారు.

  వీళ్లు గొడవ పడుతుంటే వాళ్లు ఎంజాయ్ చేశారు

  వీళ్లు గొడవ పడుతుంటే వాళ్లు ఎంజాయ్ చేశారు

  ఈ డిబేట్లో మెల్‌బోర్న్‌లోని తెలుగు వారు పాల్గొన్నారు. బాబు గోగినేని... కౌశల్, నీలిమ ఈ విషయంపై వాదించుకుంటుంటే వాళ్లంతా వేడుక చూస్తూ ఎంజయ్ చేయడం గమనార్హం.

  English summary
  Big Debate Between Kaushal and Babu Gogineni held at Melbourne. Kaushal Manda wife Neelima Fired on Babu Gogineni.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X