Don't Miss!
- Finance
IT News: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చిన టెక్ కంపెనీ.. ఆశ్చర్యంలో ఉద్యోగులు..
- News
నందమూరి తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితి ఇలా.. మళ్లీ బెంగళూరుకు బాలకృష్ణ
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu Serial Weekly Roundup: రామ పొరపాటు.. పక్షవాతంతో మంచాన పడిన తండ్రి!
జానకి కలగనలేదు సీరియల్ డిసెంబర్ నాలుగవ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

డిసెంబర్ 26వ ఎపిసోడ్
జానకి అసలు విషయాన్నీ ఇంట్లో చెప్పాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం ఆమెను అడ్డుకుంటాడు. ఇప్పుడు అఖిల్ కు జాబ్ వచ్చింది అని ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని మీరు అనవసరంగా ఈ విషయం చెబితే మళ్ళీ అందరూ బాధపడతారు అని అంటాడు. అలాగే మూడు నెలల్లోనే మళ్లీ ఆ డబ్బు వెనక్కి తిరిగి వస్తుంది అని కూడా చరణ్ చెప్పాడు అని రామచంద్ర నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ జానకి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది. మల్లిక మరోవైపు అఖిలను కోపం వచ్చేలా జానకి పై అబద్దాలు చెబుతుంది.

డిసెంబర్ 27వ ఎపిసోడ్
ఆ క్రమంలో రామచంద్ర జానకిని చూసి మల్లిక ఎంతకనో కుల్లుకుంటుంది. ఇక తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ కూడా కొంత బాధతో ఇంటికి వస్తూ ఉంటారు. వారి చేతిలో కలశాన్ని చూడగా మల్లికా ఎందుకు దాన్ని తెచ్చారు అని అనుకుంటుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి అడుగుతుంది. ఇంట్లో కొన్ని దోషాలు ఉన్నాయని అవి పోవాలంటే దీని ఇంట్లో పెట్టుకోవాలని పంతులుగారు చెప్పినట్లుగా ఆమె చెబుతుంది. ఇక ఆ మాట చెప్పగానే జానకి కొంత టెన్షన్ పడుతుంది.

డిసెంబర్ 28 వ ఎపిసోడ్
ఇక అఖిల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో అఖిల్ కూడా ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే అఖిల్ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత సైలెంట్ గా బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రామచంద్ర మళ్ళీ అదే ఆఫీసుకు వచ్చి తన స్నేహితున్ని కలుస్తాడు. అఖిల్ గురించి చెబుతాడు. ఇక మరోవైపు జానకి తన తల్లిదండ్రుల ఆప్తికం ఉంది అని మా అన్నయ్య వదినలకు ఫోన్ చేశారు అని వెళ్లాలి అని అంటుంది. అయితే తనకు ఆలస్యం అవుతుంది అని ఇప్పట్లో రాలేను అని నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని అంటాడు.

డిసెంబర్ 29వ ఎపిసోడ్
అఖిల్ మాత్రం తన మాటలతో మరింత బాధ పెడుతూ ఉంటాడు. దీంతో రామచంద్ర ఓర్చుకోలేక అసలు విషయాన్ని చెబుతాడు. అఖిల్ కోసమే పెట్టుబడి కింద 20 లక్షలు తీసుకున్నాను అని అంటాడు. దీంతో ఇంట్లో అందరూ మరింతగా షాక్ అవుతారు. ఆ విషయంలో రామచంద్ర అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు ఇక ఇంతలోనే రామచంద్ర స్నేహితుడు చరణ్ ఊర్లో నుంచి పారిపోయాడు అని తెలుస్తుంది. అతను ఆఫీస్ పెట్టడం లేదు అని తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక ఆ షాక్ లో గోవిందరాజులు గుండె పట్టుకొని ఒక్కసారిగా కింద పడిపోతాడు. అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది.

డిసెంబర్ 30వ ఎపిసోడ్
మల్లికా మూడవ కోడలు జెస్సి కి కూడా కొన్ని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. జానకి మిమ్మల్ని కూడా మోసం చేస్తోంది అని మీరు కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి మరొక కాపురం పెట్టాలి అని ఆమె చెబుతోంది. కానీ జెస్సి మాత్రం జానకి రామచంద్రలను నమ్ముతుంది. ఇక మరోవైపు మల్లిక ఇంట్లో నేను ఉండడానికి ఒప్పుకోను అని ఎవరి వాటాలు వారికి పంచాల్సిందే అని గట్టిగా అడుగుతుంది. దీంతో గోవిందరాజులు ఒక్కసారిగా గుండె నొప్పితో కింద పడిపోతాడు. అయితే వైద్యులు అతనికి పక్షవాతం వచ్చిందని అంటాడు. మరి ఈ సమస్య నుంచి జానకి తన భర్తను ఎలా బయటపడేస్తుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.