»   » ఫైనల్ ఘట్టానికి చేరిన బిగ్ బాస్, వంట చేసిన తారక్, దీక్ష ఔట్!

ఫైనల్ ఘట్టానికి చేరిన బిగ్ బాస్, వంట చేసిన తారక్, దీక్ష ఔట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : NTR Mutton Biryani : NTR మటన్ పలావ్ చేసింది ఇందుకా !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి అంతా ఊహించినట్లే దీక్షా పంత్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం జరిగే ఫైనల్ పోరులో శివ బాలాజీ, అర్చన, ఆదర్శ్, హరితేజ, నవదీప్ ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేతగా నిలివనున్నారు.

బిగ్ బాస్ ఇంట్లో జరిగిన చివరి ఎలిమినేషన్ దీక్ష. వచ్చే ఆదివారంతో బిగ్ బాస్ షో ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. చివరి వారం కావడంతో ప్రతి ఒక్కరూ షో చూసే అవకాశం ఉంది, టీఆర్పీ రేటింగ్ ఓ రేంజిలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

4 కోట్ల 88 లక్షల ఓట్లు

4 కోట్ల 88 లక్షల ఓట్లు

ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల నుండి భారీ గా స్పందన వచ్చింది. ఎన్నడూ లేనంతగా ఈ వారం 4 కోట్ల 88 లక్షల ఓట్లు ప్రేక్షకులు వేశారు. ఈ ఓట్లలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన దీక్షాపంత్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన జై లవ కుశ టీం

బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన జై లవ కుశ టీం

కాగా... శనివారం జరిగిన షోలో ‘జై లవ కుశ' టీం సందడి చేసింది. ముందుగా ఇంట్లోకి హీరోయిన్లు రాశి ఖన్నా, నివేతా థామస్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నిర్మాత కళ్యాణ్ రామ్ వచ్చారు. అనంతరం ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరై అందరినీ సర్ ప్రైజ్ చేశారు.

జై లవ కుశ గేమ్ షో

జై లవ కుశ గేమ్ షో

ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో తారక్ అండ్ జై లవ కుశ టీం..... ‘జై లవ కువ' గేమ్ షో ఆడించారు. ఆసక్తిగా సాగిన ఈ గేమ్ షోలో ఇంటి సభ్యులు జై, లవ, కుశ లాగా నటించి ఎంటర్టెన్ చేశారు.

బిగ్ ఇంట్లో వంటచేసిన తారక్

బిగ్ ఇంట్లో వంటచేసిన తారక్

బిగ్ బాస్ ఇంటి నుండి ‘జై లవ కుశ' టీం వెళ్లిన తర్వాత... తర్వాత తారక్ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో గడిపారు. వారి కోసం స్వయంగా తానే వంటచేశారు. ఇంటి సభ్యుల కోసం మటన్ పలావ్, హరితేజ కోసం రుచికరమైన టమాట పచ్చడి చేశారు.

తారక్ చిన్నతనంలో....

తారక్ చిన్నతనంలో....

వంట వండుతూ తారక్ చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. స్కూల్ డేస్ లో చాట్, పాని పూరి లాంటివి బాగా తినేవాన్ని అని తెలిపారు. అమ్మ రోజూ 20 రూపాయలు ప్యాకెట్ మనీ ఇచ్చేది, దాంతో చాట్ తిని, పానీపూరి తిని, మిగిలిన డబ్బులతో ఇంటికి కర్రీపఫ్ తెచ్చుకునే వాడిని అని తారక్ గుర్తు చేసుకున్నారు.

హరితేజ యాపిల్ వంటకంపై తారక్ జోక్

హరితేజ యాపిల్ వంటకంపై తారక్ జోక్

ఈ సందర్భంగా ఎన్టీఆర్... అంతకు ముందు రోజు హరితేజ తయారు చేసిన యాపిల్ స్వీట్‌ను రుచిచూసి జోక్స్ వేశారు. ఈ ఘట్టం చాలా ఫన్నీగా సాగుతూ ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించింది.

జిప్పు విప్పి దీక్షను ఏడిపించారు

జిప్పు విప్పి దీక్షను ఏడిపించారు

అంతకు ముందు జరిగిన ఎపిసోడ్లో.... దీక్షను ఇంటి సభ్యులంతా ఏడిపించారు. మిర్చి కవర్ జిప్ సరిగా పెట్టలేదంటూ ఆమెను శివ బాలాజీ ఆటపట్టించారు. అనంతరం ఆమ్లెట్ తినే విషయంలో కూడా సెటైర్లు వేయడంతో దీక్ష నిజంగానే ఏడ్చేసింది.

వీరి వీరి గుమ్మడిపండు

వీరి వీరి గుమ్మడిపండు

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన అనంతరం.... దీక్షతో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి గేమ్ ఆడించారు. ఈ సందర్భంగా దీక్ష ఇంటి సభ్యుల అసలు రూపం ఏమిటి? వారు కన్నింగ్, మానిప్యులేటెడ్, స్టుపిడ్, ఫూలిష్, పెర్ ఫెక్ట్, ఆరోగెంట్ ఇలా వారి వారి స్వరూపాలు చెప్పుకొచ్చింది, దీక్ష వాదనను ఇంటి సభ్యులు డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు.

ఇంటి కెప్టెన్ అర్చన

ఇంటి కెప్టెన్ అర్చన

బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుండి ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని అర్చనను ఈ వారం కెప్టెన్ గా నియమిస్తూ ఎన్టీఆర్ ఆదేశాలు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో చివరి కెప్టెన్ ఆవిడే...

అర్చన మీద బాంబ్ వేసిన దీక్ష

అర్చన మీద బాంబ్ వేసిన దీక్ష

ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే వారికి బిగ్ బాంబ్ వేసే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా దీక్షకు దక్కిన ఈ బాంబ్ అవకాశాన్ని అర్జన మీద ప్రయోగించింది. దీని ప్రకారం... బిగ్ బాస్ గంట మ్రోగినప్పుడల్లా అర్జన ఏదైనా కెమెరా ముందుకెళ్లి ఎక్కాలు చదవాల్సి ఉంటుంది.

English summary
The most watched and hyped reality show in Telugu States-Bigg Boss Telugu going to end in few days. The final week elimination process is completed. Deeksha Panth eliminated from Bigg Boss Telugu show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu