»   » ప్రిన్స్ వాడుకున్నాడు.. అర్చన, నవదీప్ మేకవన్నె పులి.. కంటతడి పెట్టిన దీక్ష

ప్రిన్స్ వాడుకున్నాడు.. అర్చన, నవదీప్ మేకవన్నె పులి.. కంటతడి పెట్టిన దీక్ష

Written By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Deeksha made allegations:ప్రిన్స్ నన్ను వాడుకున్నాడు..

తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్కువ రేటింగ్ వస్తున్న కార్యక్రమం బిగ్‌బాస్ రియాల్టీ షో. 70 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకొన్నది. ఇటీవల బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టంట్ దీక్షా పంత్ ఇటీవల టెలివిజన్ చానెల్‌తో మాట్లాడింది. ఆ సందర్భంగా ఇంటి సభ్యుల ప్రవర్తన గురించి చెబుతూ దీక్ష కన్నీటి పర్యంతమైంది. ప్రముఖ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు విషయాలు ఇవే.

ప్రిన్స్ టైంపాస్‌కు వాడుకున్నారు.

ప్రిన్స్ టైంపాస్‌కు వాడుకున్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుడు ప్రిన్స్ నన్ను టైంపాస్‌కు వాడుకున్నారు. నన్ను ముగ్గులోకి లాగడానికి పయత్నిస్తున్నట్టు గుర్తించాను. కానీ నేను ఎప్పుడూ దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన టైంపాస్‌కు నన్ను వాడుకుంటున్నట్టు ముందే తెలుసు. నేను సీరియస్‌గా తీసుకోలేదు.

నేను వాడుకోలేదు..

నేను వాడుకోలేదు..

నేను టైంపాస్‌కు ప్రిన్స్ వాడుకోలేదు. ఇంటి సభ్యులందరితో ఎలా ఉండే దానినో అలానే ఉన్నాను. నేను ఏమి చేయలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ప్రిన్స్ బిహేవియర్‌ను సీరియస్‌గా తీసుకోలేదు.

అర్చన, నవదీప్ మేకవన్నె పులులు

అర్చన, నవదీప్ మేకవన్నె పులులు

బిగ్‌బాస్ హౌస్‌లో అర్చన, నవదీప్ మేకవన్నె పులులుగా వ్యవహరించారు. హౌస్‌లో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే నాకు ఎలాంటి విషయం లేకుండానే అర్చనకు గొడవలు వచ్చాయి. అర్చన చాలా మాన్యుపులేట్ చేసింది.

చాలా మందితో విభేదాలు..

చాలా మందితో విభేదాలు..

బిగ్‌బాస్‌లో నాకు చాలా మందితో విభేదాలు ఉన్నాయి. చాలా గొడవలు ఉన్నాయి. అయితే వారు బయట కనిపిస్తే స్నేహపూరితంగా కలుస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదు. గేమ్‌లో భాగంగా వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు.

హరితేజ దారుణంగా ప్రవర్తించింది..

హరితేజ దారుణంగా ప్రవర్తించింది..

బిగ్‌బాస్ హౌస్‌లో ఎవర్నీ నమ్మాలో అర్థం కాలేదు. నాతో హరితేజ దారుణంగా ప్రవర్తించింది. నన్ను వెళ్తుండగా అమ్మోరు తల్లి అంటూ హరితేజ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. అన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత నాకు అలా సెండాఫ్ ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది అని కంటతడి పెట్టింది.

నిజాయితీగా ఆడేందుకు..

నిజాయితీగా ఆడేందుకు..

బిగ్‌బాస్‌లో నేను ఎప్పుడూ నిజాయితీగానే గేమ్ ఆడటానికి ప్రయత్నించాను. నేను నాలాగా ఉండటానికి ప్రయత్నించాను. ఇంటి సభ్యులు హర్ట్ చేస్తే నేను ఏకాంతంగా ఉండే దానిని. ఆ తర్వాత ఆ ఘటన నుంచి బయటకు వచ్చే దానిని. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఉండాలని నిర్ణయించుకొన్నాను.

నైట్ షిప్టులు చేశాను..

నైట్ షిప్టులు చేశాను..

బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువగా నైట్ షిఫ్టులు చేశాను. ఇంటి పనులు రాత్రి చేసేదానిని. నా పనులు పూర్తయ్యే వరకు అర్ధరాత్రి అయ్యేది. నేను అప్పుడు నిద్ర పోయేదానిని. కాని అలాంటి క్లిప్పింగ్‌లు చూపించలేదు. కేవలం నన్ను తిండిపోతుగానే చూపించే వారు.

శివబాలాజీకి థ్యాంక్స్

శివబాలాజీకి థ్యాంక్స్

భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. భోజనం విషయంలో శివబాలాజీ చాలా కేర్ తీసుకొనేవారు. అందుకు శివబాలాజీకి థ్యాంక్స్ చెప్పాను. రెండో ఎపిసోడ్‌లో శివబాలాజీ లాంటి వ్యక్తి ఉండాలని కోరుకొన్నాను.

ఎన్టీఆర్ ది గ్రేట్..

ఎన్టీఆర్ ది గ్రేట్..

బిగ్‌బాస్ హౌస్‌లో నాకు ఎన్టీఆర్ చాలా బాగా నచ్చాడు. ఇంతకు ముందు బిగ్‌ స్క్రీన్ మీద మాత్రమే చూశాను. బుల్లితెర మీద ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎదుటి వాళ్లను మాటలతో ఉడికిస్తూనే మళ్లీ వారిని మరో విధంగా ఆకట్టుకోవడం ఆయన ప్లస్ పాయింట్.

ఆదర్శ్, శివబాలాజీకి అవకాశం..

ఆదర్శ్, శివబాలాజీకి అవకాశం..


బిగ్‌బాస్1 విజేతగా నిలిచే అవకాశం ఆదర్శ్, శివబాలాజీకి ఉంది. ఆదర్శ్ చాలా ఫెయిర్‌గా ఆడుతున్నాడు. శివబాలాజీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. శివబాలాజీ చాలా మంచి పనులు చేశారు. కానీ కొన్ని రోజులుగా శివ బాలాజీ కొంత మారిపోయాడు.

English summary
Biggboss contestant Deeksha Panth made allegations on Co-contestants Prince, Hariteja, Archan. Deeksha said that Prince used me for timepass for while. Deeksha revealed that there is a choice for Adarsh, Shiva Balaji as Bigg Boss winner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu