Just In
- 2 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 2 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 2 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 3 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- News
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Lifestyle
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎందుకు ప్రపోజ్ చేయలేదు.. దీప్తి సునయన-షణ్ముఖ్ రచ్చ.. బయటపడ్డ విషయం
బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకునేందుక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్లాన్లు వేస్తున్నారు. వెరైటీ కాన్సెప్ట్‌లతో షోలను చేస్తున్నారు. అయితే ఏ షో చేసినా ప్రోగ్రాం చేసినా కూడా అందులో లవ్ ట్రాక్‌లు, కొన్ని కుళ్లు జోకులు, ఓ పులిహోర బ్యాచ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. అలా ఇప్పుడు బుల్లితెరపై లెక్కలేనన్ని షోలు పుట్టుకొచ్చాయి. ప్రతీ ఆదివారం సాయంత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుక స్టార్ మా కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.

అప్పుడు అలా..
ఫిబ్రవరి మొదటి రెండు ఆదివారాలు బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి ప్రేక్షకులను అలరించాడు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట వచ్చిన వచ్చిన రెండు ప్రోగ్రాంలు బాగానే క్లిక్ అయ్యాయి. ఇంత వరకు జరిగిన సీజన్లు, పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఒకే చోటకు చేరడంతో కన్నులవిందుగా అనిపించింది.
కేరళ కుట్టిగా సన్నీలియోన్.. పిక్స్ వైరల్

ఇప్పుడు ఇలా..
ఇక ఈ ఆదివారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఈవెంట్‌తో ముందుకు వచ్చింది. 100 పర్సెంట్ లవ్ అంటూ ఆరుగురు రియల్ జంటలు, రీల్ జంటల మధ్య పోటీలను పెట్టారు. ఇందులో భాగంగా బుల్లితెర రీల్ రియల్ జంటలు షోలో గెస్ట్‌లుగా వచ్చారు.

దీప్తి సునయన జంట..
దీప్తి సునయన షణ్ముఖ్ జంట కూడా ఈ షోలో పాల్గొంది. అయితే ఇది రియల్ జంట కేటగిరీలో ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రియల్ జంటలో నిరుపమ్-మంజుల, మధుబాబు-ప్రియాంక వంటి ముచ్చటైన భార్యాభర్తలో జోడి పార్టిసిపేట్ చేసింది.

ప్రపోజ్ చేయాలని..
100 పర్సెంట్ లవ్ అనే ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. అందులో దీప్తి సునయన షణ్ముఖ్‌లు వైరల్ అవుతున్నారు. బుట్టబొమ్మ అనే పాటకు ఈ ఇద్దరూ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయేలా ఉంది. దీప్తి సునయనకు ప్రపోజ్ చేయాలని అనిపించలేదంటూ షణ్ముఖ్ గాలి తీసేశాడు.

అన్నింట్లో అదే..
షణ్ముఖ్ అలా చెప్పడంతోనే.. ఎందుకు ప్రపోజ్ చేయలేదంటూ దీప్తి సునయన కసురుకుంది. ఆ తరువాత మళ్లీ దీప్తి సునయన మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన 21 బహుమతుల్లో అన్నింట్లోనూ లవ్ అనే ఉందంటూ అసలు గుట్టు విప్పేసింది. మొత్తానికి చూస్తుంటే త్వరలోనే ఈ జంట ఒక్కటి కాబోతోన్నట్టుంది.