For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రేకప్ తర్వాత ఒకే వేదికపై దీప్తి సునైనా, షణ్ముఖ్.. సిగ్గులు, పొగడ్తలు, మళ్లీ కలవనున్నారా?

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునైనా.. షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒకే స్టేజిపై షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా కనిపించి వాళ్ల ఫ్యాన్స్ కు మంచి కనులవిందునిచ్చారు. అంతేకాకుండా ఈ స్టేజిపై దీప్తిని పొగడ్తలతో ముంచెత్తాడు షణ్ముఖ్ జశ్వంత్. అసలు ఏం జరిగిందో మీరే చదివేసేయండి!

   జోడీగానే ఎక్కువ పాపులర్..

  జోడీగానే ఎక్కువ పాపులర్..

  ప్రొఫెషనల్‌గా పని చేస్తోన్న సమయంలోనే ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జశ్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులర్ అయ్యారు. దీంతో కష్ట సమయాల్లోనూ ఒకరికి ఒకరు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే దీప్తి, షన్నూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజుల పాటు వార్తలు కూడా వచ్చాయి.

  హగ్గులు చేసుకోవడంతో..

  హగ్గులు చేసుకోవడంతో..

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఓడిపోవడంతో పాటు బ్యాడ్ ఇమేజ్‌ను కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది.

  బిగ్ బాస్ తో షణ్ముఖ్ ఇమేజ్ కు డ్యామేజ్..

  బిగ్ బాస్ తో షణ్ముఖ్ ఇమేజ్ కు డ్యామేజ్..

  బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్ జశ్వంత్‌ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో దీప్తి సునైనా కూడా అతడిపై విముఖత వ్యక్తం చేసింది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ కొన్ని నెలల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును చేశాడు.

  కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'తో..

  కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'తో..

  షో వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను ప్రకటించి విడుదల కూడా చేశాడు.. దీన్ని సుబ్బు కే తెరకెక్కించాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఇక, దీప్తి సునైనా కూడా తన కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

  ఒకే స్టేజిపై కనిపించి కనువిందు..

  ఒకే స్టేజిపై కనిపించి కనువిందు..

  కవర్ సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలో అదరిపోయే హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరు ఒకే స్టేజిపై కనిపించి కనువిందు చేశారు. తాజాగా వైజాగ్ లో ఇన్ఫినిటీయం మీడియా (Infinitum Media) సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ డేని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు ఆ మీడియా సంస్థలో పనిచేసే యూట్యూబర్స్ అందరూ హాజరయ్యారు. వారిలో దీప్తీ సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఉన్నారు.

   దీప్తిని చూస్తూ షణ్ముఖ్..

  దీప్తిని చూస్తూ షణ్ముఖ్..

  దీప్తి సునైనా స్టేజి పైన ఉండగానే హోస్ట్ షణ్ముఖ్ జశ్వంత్ ని పిలిచాడు. దీంతో స్టేజిపైకి వచ్చిన షణ్ముఖ్.. దీప్తిని చూస్తూ సిగ్గుపడిపోయాడు. ఎంతో ఆనందంతో తనను చూస్తూ ఉన్నాడు. దీప్తి గురించి మాట్లాడుతూ ''మొదట్లో దీప్తి, నేను కవర్ సాంగ్ చేసే సమయంలో ఆమెపై అనేకంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయిన వెనుకడుగు వేయకుండా ముందుకు సాగింది. నేను దీప్తిని చూసి చాలా నేర్చుకున్నాను.

   దీప్తిని చూసి నేర్చుకోవాలి..

  దీప్తిని చూసి నేర్చుకోవాలి..

  అలాగే అమ్మాయిలు కూడా దీప్తిని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్. ఇక ఈ ఈవెంట్ లో దీప్తి సునైనా పక్కనే షణ్ముఖ్ జశ్వంత్ కూర్చొవడం, దీప్తిని చూస్తూ షన్నూ సిగ్గుపడిపోవడం వంటి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే కలిస్తే చాలా బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

  English summary
  Bigg Boss Telugu Fame Deepthi Sunaina And Shanmukh Jaswanth At One Stage In Vizag Infinitum Media Youtube Creators Event After Breakup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X