అభిజీత్, హారికకు మరో బిగ్ షాక్: ఫినాలేకు ముందు ఊహించని ఎదురుదెబ్బ

తెలుగులోనే టాప్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అందుకే ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నాలుగో సీజన్ సైతం మొదలైంది. ఆరంభం నుంచే ఈ సీజన్‌ అదిరిపోయే స్పందనతో దూసుకుపోతోంది. ఇక, తుది అంకానికి చేరుకోవడంతో రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్ విన్నర్‌గా భావిస్తోన్న అభిజీత్‌కు భారీ షాక్ తగిలింది. అతడితో పాటు హారికకూ అదే పరిస్థితి ఎదురైంది. ఫినాలేకు ముందు ఊహించని ఎదురుదెబ్బలు తగలడం కలకలం రేపుతోంది. అసలే జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

ఇద్దరూ కలిశారు.. ఇరగదీస్తున్నారు

ఇద్దరూ కలిశారు.. ఇరగదీస్తున్నారు

బిగ్ బాస్ హౌస్‌లో కలిసినా ఎప్పటి నుంచో స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు అభిజీత్, దేత్తడి హారిక. షో ఆరంభంలో పెద్దగా కలవని వీళ్లిద్దరూ.. ఆ తర్వాత బాగా క్లోజ్ అయ్యారు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం కూడా మొదలైంది. అంతేకాదు, వీళ్లిద్దరికి పెళ్లి కూడా చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ జంట బాగా పాపులర్ అయింది.

టైటిల్ విన్నర్... టాప్ -5 కంటెస్టెంట్

టైటిల్ విన్నర్... టాప్ -5 కంటెస్టెంట్

ఈ సీజన్ మొత్తంలో అభిజీత్ చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉంటూ గేమ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అతడు సక్సెస్ అయ్యాడు. అందుకే అతడికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా అభి ఈ సారి విజేతగా నిలుస్తాడని అంటున్నారు. మరోవైపు హారిక కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. దీంతో ఆమె ఫైనల్‌కు వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది.

తప్పులు చూపించడంతో మార్పులు

తప్పులు చూపించడంతో మార్పులు

గత వారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున అభిజీత్, హారికపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడలేదని అతడిని, కెప్టెన్ అయి ఉండి టాస్కులు సరిగా ఆడించలేదని ఆమెను మందలించాడు. దీంతో వీళ్లిద్దరి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. ఇక, ఆ వెంటనే జరిగిన నామినేషన్స్ టాస్కులో ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు.

కీలకమైన టాస్కులో రెండో రౌండ్‌కు

కీలకమైన టాస్కులో రెండో రౌండ్‌కు

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో అఖిల్, సోహెల్ అందరినీ తోసేసి పాలు నింపుకున్నారు. అయినప్పటికీ వాళ్లిద్దరితో పాటు మంచిగా గేమ్ ఆడి అభిజీత్, హారిక కూడా రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

సరికొత్తగా రెండో రౌండ్.. ముందే లీక్

సరికొత్తగా రెండో రౌండ్.. ముందే లీక్

‘రేస్ టు ఫినాలే' టాస్క్‌లో భాగంగా రెండో రౌండ్‌ బుధవారం జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ టాస్కులో బిగ్ బాస్ హౌస్‌ బయటి నుంచి పూలు పడుతుంటాయి. వాటిని పోటీలో ఉన్న అఖిల్, అభిజీత్, హారిక, సోహెల్‌లు పట్టుకోవాలి. బజర్ వినిపించే సమయానికి ఏ ఇద్దరి కంటెస్టెంట్ల దగ్గర ఎక్కువ పూలు ఉంటాయో వాళ్లు ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
అభిజీత్, హారికకు మరో భారీ షాక్

అభిజీత్, హారికకు మరో భారీ షాక్

ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ రౌండ్‌లో సోహెల్, అఖిల్ విజయం సాధించినట్లు తాజా సమాచారం. దీంతో ఫినాలేకు అర్హత సాధించాలనుకున్న అభిజీత్, హారికకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బుధవారం రాత్రి దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా, క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సోహెల్, అఖిల్‌లో ఒకరు నేరుగా ఫైనల్‌కు చేరుకోబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X