For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనుషుల మాంసాన్ని కూడా చూశాను.. భర్తతో అలా ఉండలేకపోయా: టీవీ9 దేవి నాగవల్లి

  |

  బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ కి టీవీ9కి సంబంధించిన ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎంట్రీ ఇచ్చిన దేవి నాగవల్లి మొదట్లో బాగానే ఆకట్టుకుంది. కానీ ఆమె ఎలిమినేషన్ అయిన విధానం షోలో ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక బయటకు వచ్చిన నాగవల్లి తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పుకుంటోంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల గురించి అలాగే జీవిత విధానంపై కూడా చక్కగా వివరణ ఇచ్చింది.

   తనపై కుట్ర జరిగిందని

  తనపై కుట్ర జరిగిందని

  టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవి నాగవల్లి అప్పుడప్పుడు కాంట్రవర్సీ ఇంటర్వ్యూలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ లాంటి కాంట్రవర్సీ షోలో ఆమె ఎక్కువరోజులు గెలవలేకపోయింది. బయటకు వచ్చాక తనపై కుట్ర జరిగిందని ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ తాను కాదని చెబుతోంది.

  లవ్ మ్యారేజ్ కాదు..

  లవ్ మ్యారేజ్ కాదు..

  దేవి నాగవల్లి మాట్లాడుతూ.. అందరూ అనుకున్నట్టు నాది లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి అయిన కొన్నాళ్లకు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. కానీ నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. అక్కడ ఎందుకో నేను నటిస్తు జీవిస్తున్నట్లు అనిపించింది. నాకు మనసులో నిజంగా అక్కడ ఉండాలని లేదు. ఎందుకో వాళ్ళకు నేను కనెక్ట్ కాలేకపోయాను.

   చివరికి ధైర్యం చేసి చెప్పేశాను.

  చివరికి ధైర్యం చేసి చెప్పేశాను.

  నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పడం లేదు. కానీ నేను ఎందుకో అక్కడ ఉండలేకపోయాను. ఇంట్లోనే ఉంటూ ఒంటరిగా గడపడం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే నాకు బయట ప్రపంచంలో తిరగడం ఇష్టం. ఈ జర్నలిజంలో ట్రావెలింగ్ చేయడమంటే చాలా ఇష్టం. అందుకే ఉండలేకపోయా. మొదట ఆ విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఏమైనా అనుకుంటారేమోనని అనిపించింది. చివరికి ధైర్యం చేసి చెప్పేశాను.

  ఆరు నెలల్లోనే విడాకులు వచ్చాయి

  ఆరు నెలల్లోనే విడాకులు వచ్చాయి

  ఆరు నెలల్లోనే విడాకులు వచ్చాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్ గా ఇద్దరి అంగీకారంతోనే విడిపోవడం జరిగింది. అంతేగాని సినిమాల్లో చూపించినట్లుగా కష్టాలు అనుభవించి బాధతో అయితే విడిపోలేదు. ఇప్పుడు వాళ్ళు బావున్నారు. నేను కూడా బావున్నాను. నా పనిలోనే నాకు సంతోషం ఉంది. ప్రస్తుతం నాకు ఆరేళ్ళ కొడుకు ఉన్నాడు.

  Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
   మనుషుల మాంసాన్ని చూశాను

  మనుషుల మాంసాన్ని చూశాను

  జీవితంలో నేను చేసిన వివిధ రకాల ట్రావెలింగ్స్ నాకు జీవితం యొక్క అర్ధాన్ని నేర్పింది. లైఫ్ అంటే మనకు నచ్చినట్లు ఉండడం. నేను అందరితో ఉండగలను. ఎన్నో దేశాలకు వెళ్ళాను. ఒక భూకంపం యొక్క న్యూస్ ని కూడా కవర్ చేశాను. లైఫ్ ఎండ్ పాయింట్ ఏంటో బాగా తెలుసు. మనుషులకు సంబంధించిన మాంసాన్ని కూడా చూశాను. కాశీలో మనికర్ణిక ఘాట్ వద్ద శవాలను కలుస్తూ ఉంటారు. అక్కడే తెలిసిపోతుంది. మన జీవితం ఏమిటో మనకు అర్ధమవుతుంది. ఎంత కోటీశ్వరుడు అయినా అక్కడ చాలా సాధారణమైన వ్యక్తులే.. అని దేవి వివరణ ఇచ్చింది.

  English summary
  Bigg Boss Telugu Season 4: Opening Ceremony Live amma rajasekhar Entered In Bigg Boss As 5th Contestant,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X