»   » వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నీలి చిత్రంలో నటించిన సన్నిలియోన్ వంటి వాళ్లు కూడా హీరోయిన్స్ అయ్యి ఏలుతున్నారు. అయితే తన అదృష్టం బాగుండి...నీలి చిత్రంతో తప్పించుకునే సిట్యువేషన్ నుంచి తప్పించుకున్నా అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. జాతీయ అవార్డు గ్రహిత, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ టీవి షోలో మాట్లాడుతూ...ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

2006లో 'గ్యాంగ్‌స్టర్‌' సినిమాతో కంగనా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆఫర్‌ కనుక వచ్చి ఉండకపోతే.. తాను ఓ చెత్త సినిమాతో కెరీర్ ను ప్రారంభించి ఉండేదానని పేర్కొంది.

కంగనా మాట్లాడుతూ...'కెరీర్ లో నాకు వచ్చిన 'గ్యాంగ్‌స్టర్‌' సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ముందు నాకో సినిమా ఆఫర్‌ వచ్చింది. అది ఏమంతా మంచి సినిమా కాదు. అయినా, పర్వాలేదు చేద్దామనుకున్నా. ఆ తర్వాత ఫొటోషూట్‌ కూడా చేశాను.

Did you know Kangana Ranaut almost signed an adult film?

ఆ తర్వాత కాస్ట్యూమ్‌ రోబ్‌ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. దీంతో అది నీలిచిత్రమేమో అనిపించింది. ఇది మంచి సినిమా కాదేమో, నేను చేయకూడదేమో అనిపించింది. ఇంతలోనే 'గ్యాంగ్‌స్టర్‌' సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు నచ్చడంతో అదే చేశాను' అని కంగనా తెలిపింది

'దీంతో ఆ సినిమా నిర్మాత నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ప్రాజెక్టును వదిలేయడం వల్ల కొన్ని కష్టాలు కూడా పడ్డాను. అప్పట్లో నేను 17, 18 ఏళ్ల చిన్న వయస్సులో ఉన్నాను. గ్యాంగ్ స్టర్‌ ఆఫర్‌ కనుక రాకపోయి ఉంటే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులు ప్రతి సినిమాకు ఓకే చెప్పు అన్నట్టుగా ఉండేవి' అని ఆమె పేర్కొంది. బాలీవుడ్‌ 'క్వీన్‌'గా పేరొందిన కంగన త్వరలో రంగూన్, రాణి లక్ష్మీబాయి, సిమ్రన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
National Award-winning actor Kangana Ranaut, who made her debut in Bollywood with 2006 romantic crime drama film Gangster, says if she had not got this offer, she would have started her career with a very shady film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu