»   » మహేష్ సినిమా అక్కడా డిజాస్టర్, కానీ పవన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు

మహేష్ సినిమా అక్కడా డిజాస్టర్, కానీ పవన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీ మీద అందరూ ఎంతో హోప్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న అంచనాలకు ఆ సినిమా చేరలేక డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ చిత్రం టీవి సీరియల్ లాగ ఉంది కాబట్టి బుల్లి తెరపై పెద్ద హిట్ అవుతుందని అంతా భావించారు. దానికి తోడు మహేష్ యావరేజ్ సినిమాలు సైతం టీవిల్లో రికార్డ్ లు బ్రద్దలు కొట్టాయి.

అయితే ఎవరూ ఊహించని విధంగా టీవి బ్రహ్మోత్సవం పెద్ద డిజాస్టర్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. మహేష్ కెరీర్లోనే ఎన్నడూ లేని అత్యంత తక్కువ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలచింది.


ఇటీవలే జీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేయగా.. కేవలం 7.52 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అయినా సరే.. స్టార్ హీరోల సినిమాల్లో ఇంత తక్కువ టీఆర్పీ తెచ్చుకున్న సినిమా ఇంకేదీ కనిపించలేదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


పవన్ బెస్ట్ ఈ విషయంలో

పవన్ బెస్ట్ ఈ విషయంలో

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే..‘బ్రహ్మోత్సవం' కంటే ముందు వచ్చి ఇదేస్దాయిలో డిజాస్టర్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్' 15.24 రేటింగ్ తెచ్చుకోవడం విషయం.


అంత పెట్టి కొంటే మరి ఇలాగే...

అంత పెట్టి కొంటే మరి ఇలాగే...

మహేష్ అంతకుముందు చిత్రం ‘శ్రీమంతుడు' టీవీల్లోనూ బాగా వర్కవుట్ అయ్యి లాభాలు తెచ్చిపెట్టడంతో జీటీవీ ‘బ్రహ్మోత్సవం' శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడి రూ.11.2 కోట్లు కొంది. దాంతో ఈ సినిమా పేరు చెప్పి... ఆ ఛానెల్ కు నష్టాలు తప్పేలా లేవని చెప్తున్నారు.


టాప్ లో బిచ్చగాడు

టాప్ లో బిచ్చగాడు

ఇక ఈ సంవత్సరం టాపీ టీఆర్పీల లిస్టు చూస్తే.. ‘బిచ్చగాడు' సినిమా 18.75 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచాడు. బ్రహ్మోత్సవం చిత్రాన్ని ధియేటర్స్ వద్ద కూడా బిచ్చగాడు దాటింది. ఇది చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


సాయి ధరమ్ తేజ సుప్రీమ్ ..

సాయి ధరమ్ తేజ సుప్రీమ్ ..

‘సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాతి స్థానంలో ఉంది. సుప్రీమ్ (14.79)..మాత్రమే. సాయి ధరమ్ తేజ హీరోగా పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యింది.


రామ్ చిత్రానికి...

రామ్ చిత్రానికి...

సుప్రీమ్ తర్వాత స్దానంలో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ (12.37).. చిత్రం ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టైంది. ముఖ్యంగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది.


ఎన్టీఆర్ చిత్రానికి

ఎన్టీఆర్ చిత్రానికి

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రానికి (12.23) రేటింగులతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచింది. ఈ సినిమాలో కొత్త లుక్ తో ఎన్టీఆర్ కనిపించి యూత్ లోకి దూసుకుపోయారు. ఈ సినిమా ధియేటర్స్ వద్ద కూడా బాగా ఆడింది.


English summary
Zee Telugu channel bagged 'Brahmotsavam' satellite rights for Rs 11.20 crore. This Family Drama managed to generate a TRP Rating of just 7.52 and it is poor by any standards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu