twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డిస్కవరీ ఛానెల్ 'లో అదిరిపోయే పోగ్రాం

    By Srikanya
    |

    Army Women expedition to Everest
    ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం చూపి వీక్షకులను ఆకట్టుకోవటానికి ప్రయత్నించే డిస్కవరీ ఛానెల్ తాజాగా మరో కార్యక్రమానాకి శ్రీకారం చుట్టింది. ఎడ్వెంచర్ బేస్ గా సాగే ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాక వారిలో ధైర్య సాహసాలు నింపుతాటానికి,కొత్త ఆలోచలు పురిగొల్పటానికి ఉపకరిస్తుందని చెప్తోంది.ఈ పోగ్రామే...వనితలెక్కే ఎవరెస్ట్.

    సైన్యంలో పనిచేసే వనితాధికారులు ఎంతో సాహసం చేస్తూ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ప్రక్రియను ఈ పోగ్రాంలో చూపిస్తారు. ఈ పోగ్రాంని మనం త్వరలో డిస్కవరీ చానల్‌లో చూడబోతున్నాం. అలాగే ఈ పోగ్రాం కి ఉన్న మరో విశేషమేమిటంటే ఇప్పటివరకు ఏ మహిళా వెళ్ళని సౌత్ రిట్జ్ రూట్‌లో ఈసారి ఎవరెస్టుకెళ్లడం. ఈ దారిని గతంలో 1953లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే వినియోగించారు.

    ఈ షో ఈ సంవత్సరంలోనే డిస్కవరీ చానల్‌లో ప్రసారం కానుంది. జాతిని ఉత్తేజపరటానకి ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అంటున్నారు. డిస్కవరీ ఛానల్ ఇప్పుడు తెలుగులోనూ ప్రసారమవుతోంది కాబట్టి మన బుల్లి తెర ప్రేక్షకులు కూడా దీన్ని ఎంజాయ్ చేయవచ్చు.

    ఇక ఈ పోగ్రాంని నిర్మించి ప్రసారం చేస్తున్న డిస్కవరీ ఛానెల్ ని ఇండియన్ ఆర్మీ మెచ్చుకుంటోంది. ఈ విషయమై లెప్టెనెంట్ జనరల్ ఎస్.పి .తన్వీర్ మాట్లాడుతూ..ఇలాంటి కవరేజ్ వల్ల భవిష్యత్ లో భారత సైన్యం..డిస్కవరీ ఛానెల్ తో కలిసి పోగ్రాంలు చేసేందుకు ప్లాట్ ఫాం వేసినట్లవుతుంది. ఇండియన్ ఆర్మీలోని స్పోర్ట్స్ ని,ఎడ్వంచర్స్ ని బయిటప్రపంచానికి చూపించటానకి వీలువతుంది అని ఓ ప్రకటనలో తెలియచేసారు.

    ఈ పోగ్రాం నిమిత్రం ఏడురు ఇండియన్ ఉమెన్ ఆర్మి ఆఫీసర్స్ పనిచేస్తారు. డిస్కవరీ ఛానెల్ సౌత్ ఆసియా ప్రతినిధి రాహుల్ జవారి మాట్లాడుతూ...డిస్కవరీ ఛానెల్ ఇలాంటి పోగ్రాంలు ప్రసారం చేయటంలో ముందు ఉంటుంది. ఆర్మీ వనితల సాహసాలను ఇండియాలోనే కాక ప్రపంచం మొత్తం చూపటానికి ఈ పోగ్రాం సహకరిస్తుంది అన్నారు.

    English summary
    Discovery Channel is set to produce a program on the Indian Army's women's expedition to Mount Everest this summer. This is the first time an army women's contingent is attempting to scale the Everest summit from the South Ridge route. The route was used by Edmund Hillary and Tenzing Norgay in 1953.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X