»   » నాణేనికి మరో వైపు: ఇబ్బందుల్లో యాంకర్ సుమ!(రేర్ ఫోటోస్)

నాణేనికి మరో వైపు: ఇబ్బందుల్లో యాంకర్ సుమ!(రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.

ఇవన్నీ నాణేనికి ఒక వైపు.... మరో వైపు చూస్తే అతిగా యాంకరింగ్ చేయడం వల్ల సుమ ఇపుడు ఇబ్బందుల్లో పడింది. వందలు, వేలాది మంది పాల్గొనే కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం అంటే గొంతు చించుకుని అరవాల్సిందే. ఇలాంటి కార్యక్రమాలు వరుసగా చేసీ చేసీ సుమ వాయిస్ ఇబ్బందుల్లో పడింది. కొన్ని రోజులుగా ఆమె గొంతు సంబంధమైన ఇబ్బందితో బాధ పడుతున్నట్లు సమాచారం.

యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే సుమ మరింత ఇబ్బందుల్లో పడుతుందని, పర్మినెంటుగా వాయిస్ క్రాక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం. ఒక వేళ యాంకరింగ్ చేసినా బిగ్గరగా అరవడం, గొంతు చించుకుని మాట్లాడటం లాంటి చేయొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించారట.

ఆ కారణంగానే ఈ మధ్య కాలంలో సుమ కనిపించడం చాలా తక్కువ అయింది. ప్రస్తుతం ఆమె గొంతు సంబంధమైన సమస్యల నుండి కోలుకుంటోందని సమాచారం. సుమ త్వరగా కోలుకుని గతంలోలా మళ్లీ యాక్టివ్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

స్లైడ్ షోలో సుమ రేర్ అండ్ ఫ్యామిలీ ఫోటోస్

సమస్య గురించి సుమ

సమస్య గురించి సుమ


ఆరొందల ఆడియో విడుదల కార్యక్రమాలకు పని చేశా. నా కెరీర్‌లో మూడేళ్ల పాటు నోటికి విశ్రాంతే ఇవ్వలేదు. దాంతో గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని ఆ మధ్య ఓ సారి సుమ తెలిపారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్


సుమకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈటీవీలో ప్రసారమవుతూ తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన 'స్టార్‌ మహిళ' కార్యక్రమం ద్వారా అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా ఆమె జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పింది.

2వేలకు పైగా ఎపిసోడ్లు

2వేలకు పైగా ఎపిసోడ్లు


స్టార్ మహిళ కార్యక్రమానికి 2వేలకు పైగా ఎపిసోడ్లకు సుమ యాంకరింగ్ చేసింది.

సుమ చిన్నతనంలో..

సుమ చిన్నతనంలో..


సుమ చిన్నతనంలో ఇలా ఉండేది.

హీరోయిన్ కావాలని..

హీరోయిన్ కావాలని..


మళయాలి భామ అయిన సుమ తొలుత హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది. పలు చిత్రాల్లో నటించింది.

భర్తతో కలిసి..

భర్తతో కలిసి..


భర్త రాజీవ్ కనకాలతో కలిసి సుమ.

కళ్యాణ్ రామ్ వివాహ వేడుకలో..

కళ్యాణ్ రామ్ వివాహ వేడుకలో..


కళ్యాణ్ రామ్ వివాహ వేడుకలో తన పిల్లలతో కలిసి సుమ.

ఫ్యామిలీ పిక్

ఫ్యామిలీ పిక్


సుమ, రాజీవ్ కనకాల ఫ్యామిలీ పిక్.

రాజీవ్ కనకాల, సుమ పెళ్లి ఫోటో...

రాజీవ్ కనకాల, సుమ పెళ్లి ఫోటో...

రాజీవ్ కనకాల, సుమ పెళ్లి ఫోటో...

రాజీవ్ కనకాలతో వివాహం

రాజీవ్ కనకాలతో వివాహం


తెలుగు నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.

English summary
Anchor Suma facing issues with her voice. While Suma has suffered similar issues in the past. doctors have reportedly advised Suma to refrain from shouting or speaking loudly for extended periods of time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu