వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్నీచాటే డోలు-సన్నాయి.. ఎల్‌బీ శ్రీరాం
నవంబరు, 2017 నించి ప్రతినెలా ' మొదటి శుక్రవారం ' ఒక్కో వైవిధ్యభరితమైన కొత్త చిత్రంతో మన ముందుకొస్తూంటామని- ఎల్.బి.శ్రీరాం తెలియజేశారు!
సుప్రసిద్ధ. సినీ నటులు, రచయిత శ్రీ ఎల్.బి. శ్రీరాం తన నాటక, సినీ రంగాల విశేష అనుభవంతో- లఘుచిత్రాల నిర్మాణం చేపట్టి- వాటికి ఎల్బీ శ్రీరాం హార్ట్ ఫిలింస్ అని పేరుపెట్టి- నిన్నటి, నేటి తరాల మధ్య వారధిగా నిలుస్తూ- మన సంస్కృతికీ, మానవతా సంబంధాలకీ, ముఖ్యంగా కుటుంబవిలువలకీ పెద్దపీట వేస్తూ- కొన్ని అపురూప చిత్రాల్ని తీసి, తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ముందుంచేరు!
దసరా కానుకగా- "డోలు-సన్నాయి" లఘుచిత్రంతో మళ్ళీ ఇప్పుడు మన ముందుకొచ్చారు! హిందూ వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్నీ , 'ఆలు-మగల' అద్భుత అనుబంధాన్నీ , 'డోలు-సన్నాయి'ల మంగళ వాయిద్యంగా సరి పోలుస్తూ తీసిన ఈ చిత్రం- అందరి మనసుల్నీ ఎంతో అలరిస్తోంది!. నవంబరు, 2017 నించి ప్రతినెలా ' మొదటి శుక్రవారం ' ఒక్కో వైవిధ్యభరితమైన కొత్త చిత్రంతో మన ముందుకొస్తూంటామని- ఎల్.బి.శ్రీరాం తెలియజేశారు!


Click it and Unblock the Notifications











