Double Elimination: బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు అవుట్
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 5వ వారం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయనే విషయం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతున్నాయి. గత ఐదు వారాలుగా చప్పగా సాగిన ఈ గేమ్ షోను మున్ముందు రంజుగా సాగించేందుకు సంచలనమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు షో రేటింగ్‌ను పెంచడంలో విఫలమయ్యారని భావించిన నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీతో కొందరు సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇంటిలో సరిగా పెర్ఫార్మ్ చేయని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ వారం ఇంటి నుంచి ఇద్దరు కంటెస్టెంట్లను తరిమి వేసేందుకు రెడీ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు? ఇంటిలోకి కొత్తగా వచ్చే సెలబ్రిటీలు ఎవరనే వివరాల్లోకి వెళితే..
గత నాలుగు వారాల రియాలిటీ షోలో నలుగురు సెలబ్రిటీలను ఇంటి నుంచి బయటకు పంపించారు. వారిలో శ్రష్టి వర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఉన్నారు. ఈ వారం బిగ్‌బాస్ షోలో ఎన్నడూ లేని విధంగా అందర్నీ బిగ్‌బాస్ నామినేట్ చేశారు. పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలతో కలిపి మొత్తం 11 మంది నామినేషన్స్‌లో పెట్టాడు.

అయితే టాస్కుల ద్వారా బాగా ఆడిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, దివ్య నిఖిత, పడాల పవన్ కళ్యాణ్ నామినేషన్ నుంచి తొలగించారు. రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, సంజనా గల్రానీలు డేంజర్ జోన్‌లో నిలిచారు. దాంతో ఈ వారం ఇంటి నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేశారు అనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే 5వ వారం ఓటింగ్‌లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి టాప్ స్థానాల్లో నిలువగా.. అతి తక్కువ ఓటింగ్‌తో ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, శ్రీజా దమ్ము నిలిచారు. అతి తక్కువ ఓటింగ్ నమోదు చేసుకొన్న ఫ్లోరా సైనీని ఎలిమినేట్ చేశారు.
ఇక గత కొన్నివారాలుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గాసిప్స్ వినిస్తున్నాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే నిలిచాయి. అయితే ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ పక్కా అని బుల్లితెర వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీని ప్రకారం కామన్ మ్యాన్ కోటాలో హౌస్‌లో అడుగుపెట్టిన దమ్ము శ్రీజను కూడా ఎలిమినేట్ చేయనున్నారట. గత వారమే శ్రీజ ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. పడాల పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడటంతో ఆయన ఓటింగ్ ఆమెకు మళ్లింది. దాంతో శ్రీజ బతికిపోయి... మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈసారి మాత్రం శ్రీజ ఎలిమినేషన్ పక్కా అని తేలిపోయింది. దీంతో మరో కామన్ మ్యాన్ హౌస్‌ను వీడినట్లయ్యింది. ప్రస్తుతం ఈ కేటగిరీలో పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, దివ్య నిఖితలు మాత్రమే హౌస్‌లో ఉన్నారు.
వైల్డ్ కార్డు ఎంట్రీ దవ్ారా ఇంటిలోకి తమిళ బిగ్‌బాస్ 6 షోలో పాల్గొన్న కంటెస్టెంట్, టీవీ నటి ఆయేషా జీనత్, గోల్కొండ హైస్కూల్, వినరా సోదర వీర కుమార చిత్రంలో నటించిన శ్రీనివాస్ సాయి, టీవీ నటుడు గౌరవ్ గుప్తా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లో రమ్య, పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న దివ్వెల మాధురి ఇంట్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 9 షోలో 2.0 వెర్షన్ ఆదివారం ప్రసారం కానున్నది. ఈ వెర్షన్‌కు సంబంధించిన షూట్ శనివారం పూర్తి కానున్నది. ఆదివారం సుమారుగా 2.30 గంటలపాటు మారథాన్ రన్‌తో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్‌లో పలు సంచలన విషయాలు చోటు చేసుకొంటున్నాయి. వాటిని ప్రోమోలో రూపంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











