For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హౌజ్ లో దసరా సంబురాలు.. ఆమె అందరి నడుములు గిల్లేస్తోందని ఫిర్యాదు, సింగిల్ ఎలిమినేషనా?

  |

  అత్యధిక ప్రజాదరణతో దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు 6 సీజన్. రేటింగ్, పిటిషన్, కోర్టు వ్యాఖ్యలు, తీర్పులు ఎలా ఉన్నా ఎంటర్ టైన్ మెంట్ లో తగ్గేదే లే అంటూ రంజుగా సాగుతోంది. ప్రతి సీజన్ లో శనివారం, ఆదివారం హోస్ట్ వచ్చి ఇంటి సభ్యులను ఆడిపాడిస్తాడనే విషయం తెలిసిందే. రివ్యూలు చేసి వార్మింగ్ లు ఇస్తూ క్లాసులు తీసుకోవడంతోపాటు ఫన్నీ టాస్క్ లు, సెటైర్లు, కౌంటర్లతో అలరిస్తాడు. ఇక ఏదైనా పండుగ వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ కళకళలాడుతుంది. సెలబ్రిటీల డ్యాన్స్ లు, ఇంటి సభ్యుల ఆటలతో జోరుగా ఉంటుంది. అలాగే ఈ ఆదివారం బిగ్ బాస్ హౌజ్ లో దసరా పండుగ సంబురాలు జరిగాయి. ఆ వివరాళ్లోకి వెళితే..

  ఎంతో విజయవంతంగా..

  ఎంతో విజయవంతంగా..

  రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు.

  ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్..

  ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్..

  ఇదిలాఉంటే ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తాడని తెలిసిందే. గతంలో కంటే ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కొందరు కంటెస్టెంట్లకు టిప్‌లు ఇచ్చాడు.

  ఓ రేంజ్‌లో క్లాస్..

  ఓ రేంజ్‌లో క్లాస్..


  నాలుగో వారానికి సంబంధించిన జరిగిన టాస్కుల్లో చాలా మంది చక్కగా పార్టిసిపేట్ చేశారు. కానీ, కొందరు మాత్రం నిరాశ పరిచారు. దీంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున వాళ్లకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. మరీ ముఖ్యంగా సీక్రెట్‌ టాస్కులో విఫలం అయిన చలాకీ చంటిపై అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇంటి సభ్యులు వేసిన ఓట్ల ఆధారంగా చలాకీ చంటి ఈ ఆరో సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వడానికి అనర్హుడిగా ప్రకటించారు.

  కళకళలాడిన బిగ్ బాస్ హౌజ్..

  కళకళలాడిన బిగ్ బాస్ హౌజ్..

  ఇక ఆదివారం మాత్రం బిగ్ బాస్ హౌజ్ దసరా సంబురాలతో కళకళలాడినట్లు తెలుస్తోంది. పండుగ సందర్భంగా బిగ్ బాస్ ఇల్లు, నాగార్జున, కంటెస్టెంట్లు అందగా ముస్తాబయ్యారు. ఇక ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు స్టార్ సింగర్లు పాటలు పాడటం, హీరోయిన్లు వచ్చి స్టెప్పులేయడం జరిగింది. ఇంటి సభ్యుల చేత నాగార్జున కొబ్బరి కాయ కొట్టించారు. పాటలు ఆటలతోపాటు రకరకలా టాస్క్ లు చేయించారు.

  ఎక్కువ ఎవరు తింటారు..

  ఎక్కువ ఎవరు తింటారు..

  ఇందులో భాగంగానే వేగంగా ఎక్కువ ఎవరు తింటారు అనే గేమ్ లో శ్రీసత్య తినడంతో వారం రోజులు ఇక అన్నం తినను అని నాగార్జున అన్నాడు. అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య బల పరీక్ష పెట్టారు. ఇందులో అర్జున్ కల్యాణ్ ఓడిపోతే రాత్రిపూట అన్నం తినిపిస్తా అని డీల్ ఫిక్స్ చేసుకుంటుంది శ్రీ సత్య. అలాగే అర్జున్ ఓడిపోతాడు. నాగార్జున ఘోస్ట్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ సోనాల్ చౌహన్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు వచ్చి సందడి చేశారు.

  నచ్చిన వారికి స్వీట్ లడ్డూ..

  నచ్చిన వారికి స్వీట్ లడ్డూ..

  ఆ తర్వాత చేదు లడ్డూలు, తీపి లడ్డూలు ఇచ్చి కంటెస్టెంట్లలో నచ్చనివారికి చేదు లడ్డూ, నచ్చిన వారికి స్వీట్ లడ్డూ ఇవ్వాళ్సిందిగా చెప్పాడు. ఇందులో భాగంగానే స్వీట్ లడ్డూను రాజశేఖర్ కు సుదీప ఇచ్చింది. అమాయకుడు, స్వీట్ పర్సన్ అని సుదీప చెబుతుంటే అమాయకుడు కాదు సార్ అని ఫైమా అంది. దానికి ఎన్ని అరాచాకాలు చేసిన భరిస్తున్నాడు అమాయకుడే అని సుదీప సపోర్ట్ చేసింది.

  గిల్లేస్తుంటుంది సార్..

  గిల్లేస్తుంటుంది సార్..

  ఎవరు.. ఫైమా ఏం చేస్తుందో మాకు చెప్పు అని నాగార్జున అడిగడంతో అబ్బాయిలు కానీ, అమ్మాయిల నడుము ఇలా ఎవరు కనపడితే మాత్రం గిల్లేస్తుంటుంది సార్ అని సుదీప చెబుతుంది. దీనికి అసలు రాజ్ నడుము ఎలా కనిపిస్తుంది అని నాగార్జున తిరిగి ప్రశ్నించి నవ్వు తెప్పించాడు. ఫైమా కంటిన్యూ అమ్మా.. నీ ఇష్టం అని నాగార్జున అనడంతో.. ఐయామ్ ఎగ్జైటెడ్ అని ఫైమా పైకి చూస్తూ అనడం సరాదాగా ఉంది.

  అర్జున్ కల్యాణ్, శ్రీ సత్య కలిసి డ్యాన్స్..

  ఆ తర్వాత చంటి, వాసంతి కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. రుక్సర్ దిల్లాన్, రితికా సింగ్, శ్రద్ధా దాస్ వచ్చి పాటలకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. అనంతరం అర్జున్ కల్యాణ్, శ్రీ సత్య కలిసి డ్యాన్స్ చేయడం, వివిధ ఆటలు ఆడిన తర్వాత సార్.. ఇవాళ సింగిల్ ఎలిమినేషనే కదా సార్ అని నాగార్జునను గీతూ రాయల్ అడుగుతుంది. దీంతో సస్పెన్స్ డ్ గా ఆదివారం ఎపిసోడ్ ప్రోమోను ముగించారు. ఇదిలా ఉంటే ఈ వారం ఆరోహి రావు ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

  English summary
  Dussehra Festival Celebration In Bigg Boss Telugu 6. And Contestants Celebrities Participates.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X