తెలుగు ఛానెల్స్ లో ఏ పోగ్రామ్ టాప్..ఏది ప్లాప్

ఆ లెక్కలే రేటింగ్స్. ఏ కార్యక్రమాన్ని ఏ వయసు వారు మహానగరాల్లో, నగరాల్లో ఎంతసేపు చూశారో తేల్చి చెబుతున్నామంటుంది టామ్ సంస్థ. ఒక వైపు రేటింగ్స్‌ను తిట్టుకుంటూనే మరోవైపు ఆ రేటింగ్స్ పెరగాలని అక్రమమార్గాలూ, అనైతిక పద్ధతులూ అనుసరించే చానల్స్ కోకొల్లలు. కానీ ఆ అక్రమమార్గాల్లో టామ్‌కూ భాగస్వామ్యముందని ఆరోపణలు రావటమే చాలా కాలంగా జరుగుతున్నదే.
ఆ విషయాలు ప్రక్కన పెడితే... క్రితం వారం వివిధ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు వచ్చిన రేటింగ్స్ ఏమిటి...దేనికి ఎక్కువ రేటింగ్స్ వచ్చాయనేది గమనిస్తే... అన్నిటికంటే ముందుగా జబర్దస్త్ రేటింగ్స్ ఉండగా మొదటి 20లో జీ తెలుగుకు ఒక స్థానమే దక్కింది.
( అక్టోబర్ 26 తో ముగిసిన మొదటి 10 కార్యక్రమాలు టామ్ రేటింగ్ ప్రకారం )
1. జబర్దస్త్- ఈటీవీ - గురువారం- సమయం 21.30- రేటింగ్ 29.12
2 బోల్ బేబీ బోల్-3- జెమిని- శని- సమయం 21.00- రేటింగ్ 19.97
3 మేస్ట్రో మాజికల్ ఈవెంట్- మా టీవీ- శని-సమయం 19.30- రేటింగ్ 18.74
4 క్యాష్- ఈటీవీ- శని- సమయం 21.30- రేటింగ్ 11.31
5 ఢీ-6- ఈటీవీ- బుధ-సమయం 21.30- రేటింగ్ 10.02
6 బోల్ బేబీ బోల్-3- జెమిని- - సమయం 21.15- రేటింగ్ - రేటింగ్ 9.77
7 జబర్దస్త్- ఈటీవీ- ఆది- సమయం 10.30- రేటింగ్ - రేటింగ్ 9.18
8 గెట్ రెడీ- ఈటీవీ- శుక్ర- సమయం 21.30- రేటింగ్ 7.69
9 జబర్దస్త్- ఈటీవీ- మంగళ- సమయం 16.30- రేటింగ్ 7.06
10 అలీ 369- ఈటీవీ- మంగళ- సమయం 21.30- రేటింగ్ 6.85
గమనిక.... : ఈ రేటింగ్స్ కేవలం టామ్ సంస్ధ ఇచ్చిన సమాచారం (మీడియాలో ప్రచారంలో ఉన్న) మేరకు ... అలాగే ఈ రేటింగ్ లు వారం వారం మారిపోతూంటాయి.. వచ్చే వారానికి అంతా పూర్తిగా మారిపోవచ్చు కూడా.


Click it and Unblock the Notifications











