»   » ఆశ్చర్యపోయే రేటు :‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ శాటిలైట్ రైట్స్ కు అంత పెట్టిందా ఛానెల్

ఆశ్చర్యపోయే రేటు :‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ శాటిలైట్ రైట్స్ కు అంత పెట్టిందా ఛానెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో నిఖిల్...కు తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో ఇంకో సూపర్ హిట్ దొరికింది. నవంబర్ 18 న రిలీజ్ అయి హిట్ టాక్ నూ సంపాదించుకుంది ఈ మూవీ శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సూపర్ హిట్టే అంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం జీటీవి వారు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను రూ. 4 కోట్లు పెట్టి కొనుక్కొందని సమాచారం. మూవీ మొత్తం తీయడానికి అయిన ఖర్చు మాత్రం ఏడు కోట్లయితే... అందులో సగానికి పైగా శాటిలైట్ ద్వారా రావటంతో నిర్మాత జాక్ పాట్ కొట్టినట్లే.


డిమానిటైజేషన్ తర్వాత విడుదలై.. హిట్ సాధించిన చిత్రంగా ఎక్కడికి పోతావు చిన్నవాడాకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది. అలాగే ఇంత గడ్డు సమయంలోనూ.. శాటిలైట్ రూపంలో ఏకంగా 4 కోట్ల రూపాయలు రావడం విశేషమే మరి. విడుదలకి ముందు కొన్ని బేరాలు జరిగినా.. మూవీ హిట్ పై పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్న నిర్మాతలు.. ఇప్పుడు శాటిలైట్ హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని పొందగలిగారు.


Ekkadiki Pothavu Chinnavada Satellite Rights sold

అంతే కాదు, ఈ మూవీ తమిళ్, కన్నడ రిమేక్ హక్కుల కోసం కొంతమంది తమిళ్, కన్నడ దర్శకులు ఈ మూవీ యూనిట్ ను సంప్రదించారట. ఇక జనవరి 6తో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం 50రోజులు పూర్తి చేసుకోనుండడంతో.. హైద్రాబాద్ లోని ఓ మాల్ లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంది యూనిట్. సినిమా టీమ్ అంతా కలిసి అక్కడ మూవీ చూసి.. ఆ తర్వాత షీల్డ్ ల ప్రదానం కూడా చేయనుండడం విశేషం.


హీరో నిఖిల్ గ్రేస్ ఫుల్ యాక్టింగ్ తో పాటు... నందిత శ్వేత పెర్ఫార్మెన్స్, హెబ్బ పటేల్ గ్లామర్, అవిక గోర్ రీమార్కబుల్ గెస్ట్ రోల్, విఐ ఆనంద్ మేకింగ్, శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ స్కోర్, సాయి శ్రీరామ్ బ్రిలించ్ ఫోటోగ్రఫీ సినిమా విజయానికి ఎంతగానో తోర్బడింది.


బ్యానర్: మేఘ‌న ఆర్ట్స్‌
తారాగణం: నిఖిల్‌, హెబ్బాపటేల్‌, నందితా శ్వేత, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ తదితరులు
పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్త్రి, శ్రీమ‌ణి,
ఆర్ట్‌- రామాంజ‌నేయులు,
ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,
సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,
మాట‌లు- అబ్బూరి ర‌వి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశీను
డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,
సంగీతం: శేఖర్‌ చంద్ర,
నిర్మాత: పి.వి.రావు,
రచన, దర్శకత్వం: వి.ఐ. ఆనంద్‌
నిడివి: 140 నిమిషాలు,
విడుదల తేదీ: 18-11-2016

English summary
Reports are arriving that EPC satellite rights are acquired by Zee Telugu at an whopping cost of 4 crores. At a time the film completes 50 days run (by Jan 6th) at box office, this is a big achievement for Nikhil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu