For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ముందుగా గార్డెన్ గేమ్ తర్వాత ఎలిమినేషన్ ఆట.. ఏడ్చేసిన ఇంటి సభ్యులు

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ కొంత రసవత్తరంగా, కొంత అరాచకంగా జరిగింది. బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ పాల్గొన్న గేమ్ లో రెడ్ టీమ్ ఎదుటి టీమ్ వాళ్ల బలహీనతలపై కొట్టడం, రెచ్చగొట్టడం, వెకిలీ చేష్టలు, లూపులు అంటూ పనికిరాని లాజిక్స్ వెతుక్కుంటూ అరాచకం సృష్టించింది.

  ఈ విషయాలపై శనివారం ఎపిసోడ్ లో వచ్చిన హోస్ట్ నాగార్జున క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం ఫన్ డే అలాగే ఎలిమినేషన్ డే. ఇవాళ్టి ఎపిసోడ్ మొదటి ప్రోమోలో ఇనయా కోసం సీక్రెట్ రూమ్ తెరిపించిన నాగార్జున రెండో ప్రోమోలో ఎలిమినేట్ ఎవరనేది ఇంటి సభ్యుల్లో టెన్షన్ క్రియేట్ చేశాడు. నవంబర్ 6 ఎపిసోడ్ రెండో ప్రోమో వివరాళ్లోకి వెళితే..

  నామినేషన్లలో 10 మంది..

  నామినేషన్లలో 10 మంది..

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్లలో మొత్తం 10 మంది ఉన్న విషయం తెలిసిందే. వీరిలో కెప్టెన్ అయిన కారణంగా శ్రీహాన్ నామినేషన్ నుంచి తప్పించుకోగా వాసంతి, రాజ శేఖర్ ని ఎవరు నామినేట్ చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మిగిలిన 13 మంది కంటెస్టెంట్లందరు కెప్టేన్ కంటెండర్ టాస్క్ ఆడారు. అందులో చివరిగా శ్రీ సత్య కెప్టెన్ గా నిలించింది.

  ఎలిమినేషన్ గురించి చెప్పి..

  ఎలిమినేషన్ గురించి చెప్పి..

  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఈ వారం ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. గొడవలు, అరుచుకోవడాలు, లూప్ లు, స్ట్రాటజీస్, బలహీనతలు, కన్నింగ్ గేమ్ లు అంటూ ఏదోదో చేశారు. ఇక ప్రతి శని, ఆదివారాల్లో వచ్చే హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆట తీరుపై రివ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. శనివారం వచ్చి నాగార్జున క్లాస్ తీసుకోగా ఆదివారం గేమ్స్ ఆడించాడు. తర్వాత ఎలిమినేషన్ గురించి చెప్పి అందరిని టెన్షన్ లో పెట్టాడు.

  ఒక్కొక్కరు ఔట్ అవుతూ..

  ఒక్కొక్కరు ఔట్ అవుతూ..

  తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో ఇంటి సభ్యుల చేత బీ ఆన్ ది ఫ్లవర్ గేమ్ ఆడించారు. పూలు గార్డెన్ లో పెట్టి తుమ్మెదల్లా రెడీ అయ్యారు ఇంటి సభ్యులు. పాట ప్లే చేసినప్పుడల్లా అందరూ చిందులేయాలి. సాంగ్ ఆగిపోయాక పూల దగ్గరికి వెళ్లి నిల్చోవాలి. ఎవరికైతే పువ్వు దక్కతో వారు అవుట్. అలా ఒక్కొక్కరు ఔట్ అవుతూ చివరికీ ఒకరు విన్ అవుతారు. వారికి ఏదో ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు.

  మొహాలు వాడిపోయినట్లు..

  మొహాలు వాడిపోయినట్లు..

  ఇలా ఆటలాడించిన హోస్ట్ నాగార్జున చివరికీ ఎలిమినేషన్ చేసే రౌండ్ చూపించారు. అందులో చివరిగా శ్రీసత్య-గీతూ రాయల్ కనిపించారు. హౌజ్ లో వీళ్లద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అలా ఎలిమినేషన్ లో ఫైనల్ గా వాళ్లు ఇద్దరే ఉండేసరికి వాళ్ల మొహాలు వాడిపోయినట్లే కనిపించాయి. వారి ముందు ఫిష్ బౌల్స్ పెట్టారు. ఇద్దరికీ చెరో లిక్విడ్ ఉన్న బాటిల్ ఇచ్చారు. ఆ లిక్విడ్ ను ఫిష్ బౌల్ లో ఫిల్ చేయమని చెప్పారు.

  ఏడ్చేసిన ఫైమా..

  ఏడ్చేసిన ఫైమా..

  అందులో ఎవరి రంగు అయితే గ్రీన్ కలర్ కు వస్తుందే వారి సేఫ్.. మిగిలిన వారు ఎలిమినేట్. ప్రోమోలో అయితే గీతూ ఎలిమినేట్ అయినట్లు చూపించలేదు గానీ, శ్రీహాన్, ఫైమా, వాసంతి మాత్రం బాధగా కనిపించారు. దీంతో ప్రోమో ముగిసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారానికి కెప్టెన్ అయిన శ్రీ సత్య నామినేషన్లలో కూడా ఉంది. కెప్టెన్ కంటెండర్ టాస్క్ లో శ్రీ సత్య గేమ్, బిహేవియర్ చూసిన ప్రేక్షకులకు చిరాకు వచ్చింది.

  చివరి స్థానంలో ఉండటంతో..

  ముందుగా అందరూ శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. కానీ గీతూ రాయల్ కూడా చివరి స్థానంలో ఉంది. దీంతో ఆమెకు తక్కువగా ఓట్లు పడటంతో ఎలిమినేట్ అయింది. ఇక గీతూ రాయల్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. స్ట్రాటజీస్, లూప్ లు అంటూ ప్రతిసారి గేమ్ ను అస్తవ్యస్తం చేసింది.

  అది కరెక్ట్ కాదని చెప్పినా వినిపించుకోకుండా తనదే కరెక్ట్ అన్నట్లుగా బిహేవ్ చేసింది. బిగ్ బాస్ రూల్స్ కూడా చాలా సార్లు అతిక్రమించింది. ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకే వస్తుందని గీతూ చేసిన (రీల్స్ లో) హితబోధ ప్రకారం ఆమెనే ఎలిమినేట్ అయిందని నెటిజన్లు అనుకుంటున్నారు.

  English summary
  Nagarjuna Creates Tension About Elimination Contestant Of Bigg Boss Telugu 6 9th Week And November 6 Episode Latest Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X