»   » మంచు లక్ష్మి అతిధి...ఈటీవీ కే అవార్డు

మంచు లక్ష్మి అతిధి...ఈటీవీ కే అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాల బాలికలు, విద్యార్థులకు సంబంధించిన వివిధ అంశాల్లో యూనిసెఫ్‌ మొత్తం తొమ్మిది విభాగాల్లో అవార్డులను ప్రకటించగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ రెండు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అయా అంశాలపై నిర్వహించిన చర్చల విభాగంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమవుతున్న ప్రతిధ్వని కార్యక్రమాన్ని యూనిసెఫ్‌ అవార్డు వరించింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన యూనిసెఫ్‌ అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటీవీ తరఫున ప్రతిధ్వని ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌ జీవీఎస్‌మూర్తి, శ్రీకాంత్‌లు అవార్డును అందుకున్నారు.

Etv Andhrapradesh Receives Unicef Award

టాపికల్‌ న్యూస్‌ విభాగంలో 'ర్యాగింగ్‌ రక్కసి' పేరుతో ప్రసారమైన ఇదీ సంగతి కథనం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును ఇదీ సంగతి బులిటెన్‌ ప్రొడ్యూసర్‌ వై.శ్రీనివాస్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇదీ సంగతిలో ప్రసారం చేస్తున్న కథనాలు కదలించేలా ఉన్నాయని యూనిసెఫ్‌ 7వ అడిషన్‌ అధ్యక్షుడు ఉమాపతి అభినందించారు.

Etv Andhrapradesh Receives Unicef Award

అలాగే సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశాలను వెలికితీయడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలని యూనిసెఫ్‌ జ్యూరీ 7వ ఎడిషన్‌ అధ్యక్షుడు ఉమాపతి కోరారు.

English summary
Etv won in two categories of the 9 UNICEF Awards for Children-Related programmes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu