»   » షాకిస్తున్న 'జబర్దస్త్‌' టీవీ షో లెక్కలు

షాకిస్తున్న 'జబర్దస్త్‌' టీవీ షో లెక్కలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Etv Jabardasth completed 50 weeks
హైదరాబాద్ :దక్షిణాది టీవీఛానళ్ల కామెడీ ఆధారిత కార్యక్రమాల్లో 'జబర్దస్త్‌' ముందంజలో ఉంది. దీనికి టీవీలోనే కాదు యూట్యూబ్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఈ కార్యక్రమాన్ని 2,74,70,948 మంది వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 60,64,269 గంటలపాటు యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూశారు. ఆరు బృందాలు ప్రేక్షకులకు నవ్వుల జల్లులు కురిపిస్తున్న ఈ కార్యక్రమం నేటితో 50 వారాల మైలురాయిని చేరుకుంది.


జబర్దస్త్‌... జబర్దస్త్‌... జబర్దస్త్‌... గురువారం రాత్రి 9.30 గంటలకు ఏ వూర్లో చూసినా... ఏ ఇంట్లో చూసినా ఇదే మాట. అంతగా ప్రజాదరణ పొందుతోంది ఈ ఖతర్నాక్‌ కామెడీ షో. టీవీ టీఆర్పీల్లోనూ, వెబ్‌ వీవర్స్‌లోనూ అగ్రస్థానంలో సాగుతున్న వినోదాత్మక కార్యక్రమమిది. నవ్వించడమే ధ్యేయంగా మల్లెమాల ఎంటర్‌ప్రైజెస్‌, ఈటీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న నవ్వుల యుద్ధమిది.
50 వారాల మైలురాయిని సందర్భంగా కార్యక్రమ న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజాల ఏమంటున్నారు..

నాగబాబు మాట్లాడుతూ....ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తోందంటే ఎక్కడికెళ్లినా అందరూ ఈ కార్యక్రమం గురించే అడుగుతున్నారు. ప్రేక్షకుల్ని గంటన్నరపాటు అలరించడమంటేనే కష్టం. అందులోనూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటమంటే మరీ కష్టం. దీన్ని 'జబర్దస్త్‌' ద్వారా మేము చేస్తున్నాం అన్నారు.

రోజా మాట్లాడుతూ...ఈ కార్యక్రమం వల్ల నేను హీరోయిన్ గా ఉన్నప్పటి కంటే ఎక్కువ ఆదరణ పొందాను. ఇక్కడ కామెడీ చేసినవారికి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. నాకు, నాగబాబు గారికి ఎప్పటి నుంచో స్కిట్‌ చేయాలని ఉంది. రిహార్సల్‌ చేసి వేద్దాం అనుకుంటున్నాం. ఈటీవీలో షో చేయాలని అందరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా మంచి థియేటర్‌లో విడుదల కావాలని అందరూ కోరుకున్నట్టే, ఓ కార్యక్రమం మంచి ఛానల్‌లో రావాలని కోరిక ఉంటుంది. అంతటిస్థాయి ఉన్న టీవీ ఈటీవీ అన్నారు.

అలాగే మేము న్యాయనిర్ణేతలమే...కానీ పోటీదారుల్ని శాసించలేం కదా. అందుకే వారిని నొప్పించకుండా వారి నుంచి పనిని రాబట్టుకుంటున్నాం. ఈటీవీలో గతంలో అదుర్స్‌ చేశాను. దానికీ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 'జబర్దస్త్‌' ద్వారా ఇంకా మంచి పేరు వచ్చింది అని ఇద్దరూ చెప్తున్నారు.

English summary
Etv's Comedy Show Jabardasth completed 50 weeks. Roja and Naga babu ..both as judges of this comedy show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu