»   »  విభజన ఎఫెక్ట్: ఈటీవీ తెలంగాణ ఛానల్?

విభజన ఎఫెక్ట్: ఈటీవీ తెలంగాణ ఛానల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ETV
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి పోయిన నేపథ్యంలో పలు టీవీ ఛానల్స్ కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో వేర్వేరుగా ఛానల్స్‌‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాల్లో రామోజీరావుకు చెందిన ఈటీవీ గ్రూపు ముందున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 'ఈటీవీ'ని తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఈటీవీఎ' పేరుతో మరో ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఈటీవీ2 న్యూస్ ఛానల్ కూడా రెండు ప్రాంతాలకు వేర్వేరుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఈటీవీ2 ఛానల్‌ వేరుగా ఏర్పాటు చేసి తెలంగాణ స్లాంగు(యాస)తో నడిపించాలని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నదాన్నే కొనసాగించాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఒక్క ఛానల్ మాత్రమే కాదు...ఇతర తెలుగు ఎంటర్టెన్మెంట్, న్యూస్ ఛానల్స్ కూడా ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఛానల్స్‌పై సీమాంధ్ర ఛానల్స్ అని ముద్ర పడిన నేపథ్యంలో సదరు ఛానల్స్ ఈ సరికొత్త ఆలోచనకు తెర దించినట్లు సమాచారం.

జూన్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అఫీషియల్‌‌గా ఆవిర్భవించనున్న నేపథ్యంలో.....అప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త ఛానల్స్ కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
According to source, ETV to launch Telangana channel soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu