»   »  ఘనంగా 'ఈటీవీ' కొత్త ఛానెళ్ల ప్రారంభోత్సం

ఘనంగా 'ఈటీవీ' కొత్త ఛానెళ్ల ప్రారంభోత్సం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఈటీవీ నాలుగు కొత్త ఛానెళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో శనివారం ఘనంగా జరిగింది. ఈటీవీ ప్లస్‌, ఈటీవీ లైఫ్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి ఛానెళ్లను మనవరాలితో కలిసి రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, 'ఈనాడు' ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ETV new channels launched today

ఈటీవి ని 1995 ఆగస్టు 27న ప్రారంభించారు. ఎంటర్టైన్మెంట్ లో ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకుని తెలుగు వారి గుండెల్లో ప్రత్యేకమైన ముద్ర వేయగలిగింది. తనదైన శైలి తో స్పెషల్ పోగ్రామ్స్ తో ఈటీవి అందరినీ అలరిస్తూ ముందుకు సాగుతోంది. గత ఇరవై సంవత్సరాలుగా ఈటివి తన తనదైన విలువలతో ప్రత్యేకమైన స్ధానాన్ని నిలబెట్టుకుంటూనే వస్తోంది.

ఈటీవి నుంచి మరో నాలుగు కొత్త ఛానెల్స్ వచ్చి తెలుగు వారిని అలరించనున్నాయి. ఈరోజు నుంచే ఈ ఛానెల్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే న్యూస్ కు ఒకటి, ఎంటర్టన్మెంట్ కు ఒక ఛానెల్ ఉన్నాయి.

ఇప్పుడు కొత్తగా కామెడీ కోసం ఈటీవి ప్లస్, ఆరోగ్యం కోసం ఈటీవి లైఫ్, సినిమాల కోసం ఈటీవి సినిమా, వంటల కోసం ఈటీవి అబిరుచి ఛానెల్స్ మొదలవుతున్నాయి.

ETV new channels launched today

తమ ఛానెల్స్ లో కొన్నిటిని వయాకామ్ కు ఇచ్చేసాక, ఇప్పుడు రామోజీ గ్రూప్ ఈ విధంగా కొత్త ఛానెల్స్ తో విస్తరిస్తోంది. ఈటీవి ప్లస్ లో ఎక్కువగా సినిమాలకు సంభందించిన కంటెంట్, కామెడీ, రియాలటీ షోలు ఉంటాయని సమాచారం.

అళాగే ఈటీ సినిమాల కోసం చాలా సినిమాలు ఇప్పటికే కొన్నారని చెప్తున్నారు. మా, జెమెనీ, జీ తెలుగు ఛానెల్ లాగానే ఈటీవి కూడా పెద్ద స్టార్స్ సినిమాలను ఇక నుంచి ప్రసారం చేయనుందని సమాచారం. అందుకోసం పెద్ద హీరోలు సిని మాల కొనుగోలుకు ఉత్సాహం చూపుతోంది.

English summary
Ramoji take up some important channels namely namely ETV Life, ETV Cinema, ETV Plus and ETV Abhiruchi from today. ETV plus is especially designed for Youth where in cinema channel is totally dedicated to movies all the time. For few interesting health elements they got ETV Life . Cooking got special case and ETV Abhiruchi will deal with them.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu