»   » స్టార్ కమెడియన్ పై మరో కేసు.. ప్రధానిని సూటిగా ప్రశ్నించిన ఎఫెక్టే అంటూ ఫ్యాన్స్

స్టార్ కమెడియన్ పై మరో కేసు.. ప్రధానిని సూటిగా ప్రశ్నించిన ఎఫెక్టే అంటూ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత కపిల్ శర్మపై ముంబైలో కేసు నమోదైంది. కపిల్ శర్మ వెర్సోవా ఏరియాలోని తన బంగ్లాకు సమీపంలో నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తూ, మడ అడవుల ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని అతనిపై కేసు నమోదైంది. కపిల్ శర్మపై అధికారులు పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎంఆర్‌టీపీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

అవినీతి అధికారుల తీరుపై ట్వీట్‌ చేసి.. ప్రధాని మోడీనే అచ్చేదిన్‌ ఎక్కడా అని ప్రశ్నించినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయంటున్నారు ఆయన అభిమానులు. ముంబయి లోని తన బంగ్లాలో కార్యాలయం నిర్మించుకోవడానికి మున్సిపల్ అధికారులు లంచం అడిగారని 'అచ్చే దిన్' (మంచిరోజులు) అంటే ఇదేనా అని ఏకంగా ప్రధాని మోడీకే ట్వీట్ చేసాడు. ఈ విషయం పెద్ద దుమారం రేపింది.

FIR filed against Kapil Sharma

మోడీని సూటిగా ప్రశ్నించినట్లుగా ఉన్న ఈ ట్వీట్‌ ఆరోపణపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పందించి.. విచారణకు ఆదేశించారు. తాజాగా అవినీతి ఆరోపణలు చేసిన కపిల్‌ శర్మపైనే అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేయటం గమనార్హం. కపిల్‌ చేసిన ట్వీట్‌ ఆరోపణే తాజా రియాక్షన్‌ కు కారణమా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.


అయితే ఈ విచారణలో కపిల్ శర్మ ఉంటున్న బంగ్లా అక్రమ నిర్మాణమని తేలింది. కపిల్ శర్మ నివాసం పూర్తిగా అక్రమమైనదని ఇరుగు పొరుగు వారు కూడా ఆరోపించారు. ముంబయి మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ కపిల్ శర్మ భవన నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగాయని, వాటికి తమదగ్గర దానికి సంబందించిన పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కపిల్ శర్మకు చెందిన ఈ బంగ్లా అంధేరి లోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉంది. అయితే కపిల్ శర్మ ఈ కేసు విషయంలో ముంబయి హైకోర్టు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.


కలర్స్ చానల్ లో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కలర్స్ చానల్ ఈ కార్యక్రమ ప్రసారం ఆపేయడంతో సోనీలో 'ద కపిల్ శర్మ షో'తో కపిల్ గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

English summary
Mumbai police registered an FIR on instructions from the Metropolitan Magistrate’s Court in Andheri against actor Kapil Sharma for allegedly adding unauthorised extensions to his office in Andheri and destroying mangroves in the process.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu