Bigg Boss: లక్స్ పాప షాకింగ్ ఎలిమినేషన్.. ఫ్లోరా సైనీ రెమ్యునరేషన్ ఎంతంటే?
Flora Saini Remuneration: బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో రోజురోజుకు ఉత్కంఠగా మారిపోతుంది. ఏ సమయంలో ఎలాంటి ట్విస్టులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. గత 8 సీజన్లను ఫాలో అవుతున్నా.. ఎప్పుడూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించ లేని విధంగా సాగుతోంది బిగ్ బాస్. అలాంటి కొత్త మలుపులు, నామినేషన్లు, ఎలిమినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ ఊహించని ఎలిమినేషన్ జరిగింది. అసలు ఎవరూ అనుకోని విధంగా ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. హీరోయిన్ ఫ్లోరా సైనీ. మొదటి వారం నుంచే డేంజర్ జోన్‌లో ఉండి కూడా వరుసగా ఎలిమినేషన్‌ను తప్పించుకుంటూ వచ్చిన ఫ్లోరా చివరికి ఐదో వారం హౌస్‌కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
ఫ్లోరా సైనీ అంటే సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'స్ట్రీ', 'నార్కోస్', 'దాన్ గాళ్స్' వంటి హిందీ ప్రాజెక్టుల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ నెలకొంది. కానీ, ఆ అంచనాలను ఫ్లోరా అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే హౌస్‌లో చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్‌గా కనిపించింది. మెయిన్ గా భాష సమస్య .. దీంతో ఎవరితోనూ పెద్దగా గొడవలు లేకుండా, ఎవరికీ ఎక్కువ దగ్గర కాకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. దీంతో కెమెరా ముందుకు రాలేకపోయింది. అసలు గేమ్ లో ఉందా లేదా? అనేలా సాగింది ఆమె గేమ్. అదే ఆమెకు మైనస్ అయింది.

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకులు ఎక్కువగా చూడాలనేది డ్రామా, ఎమోషన్, ఫన్, ఫైట్స్. కానీ ఫ్లోరా వైపు ఇవేవీ కనిపించలేదు. అప్పుడప్పుడు కాసేపు యాక్టివ్‌గా కనిపించినా కూడా ఆ ఎనర్జీ కొనసాగలేదు. సంజనాతో అత్యంత సన్నితంగా, స్నేహంగా ఉండటం, సంజనా తానా అంటే.. ఫోర్లా తందానా అనేలా గేమ్ కొనసాగింది. దీంతో సంజనా గల్రానీకి సేవకురాలిలా మారిపోయిందనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి. ప్రేక్షకులు "ఫ్లోరా కన్నా సంజనా ఎక్కువ ఎంటర్‌టైన్ చేసింది" అని తేల్చేశారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకుల ఫ్లోరా ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే అని ఫిక్స్ అయ్యారు. ఈ వారం ఆమె నామినేషన్స్ తో ఉండటంతో ఓట్లు వేయడం మానేశారు.
ఇదిలా ఉంటే.. అయినా ఫ్లోరా ఈ ఐదు వారాల ప్రయాణంలో తనకు మంచి రిటర్న్ తీసుకువచ్చిందనే చెప్పాలి. అందుతున్న సమాచారం ప్రకారం, బిగ్ బాస్ మేకర్స్ ఫ్లోరాకు ప్రతి వారం రూ. 3 లక్షల చొప్పున పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. అంటే రోజుకి దాదాపు రూ. 42,857 లెక్క. ఐదు వారాలుగా హౌస్‌లో ఉన్న ఆమె మొత్తం రూ. 15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ అంకెలు బట్టి చూస్తే ఫ్లోరా షోలో అంత గేమ్ ఆడకపోయినా ఆర్థికంగా మాత్రం నష్టపోలేదు. అంతేకాక, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొనడం వల్ల పబ్లిసిటీ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు బయటకు వచ్చిన ఫ్లోరాకు వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షో ఆఫర్లు కూడా వచ్చి చేరుతున్నాయని ఇండస్ట్రీ టాక్.
ఇక ఫ్లోరా ఎలిమినేషన్‌తో హౌస్‌లో కొత్త ట్విస్ట్‌లు మొదలయ్యే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో గేమ్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఫ్లోరా సైలెంట్‌గా వెళ్లిపోయినా.. ఆమె రెమ్యూనరేషన్ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో మరో చర్చా అంశంగా మారింది.


Click it and Unblock the Notifications











