»   »  రెండు పడవలపై కాళ్లు ...మంచు లక్ష్మి ని ముంచింది

రెండు పడవలపై కాళ్లు ...మంచు లక్ష్మి ని ముంచింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు కుమార్తె గా పరిచయమై తర్వాత నటి గా తన కంటూ ఇండిడ్యువాలిటీ సంపాదించుకోవటంలో విజయం సాధించింది మంచు లక్ష్మి ప్రసన్న. దానికి తోడు ఒకే సారి అటు బుల్లి తెర, ఇటు వెండి తెర రెండింటిపై కాలు పెట్టింది. రెండు చోట్లా పాపులర్ అవుతానని భావించింది. కానీ ఆమె ఆశలు అడియాశలు అవుతున్నాయి. బుల్లి తెరపై ఆమె టాక్ షో దూసుకెళ్తా అర్దాంతరంగా ఆగిపోయింది. ఇటు ఎంతో ఎక్సపెక్ట్ చేసి చేసిన చందమామ కథలు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. దాంతో ఆమె హవాకు ఒక్కసారిగా బ్రేకు లు పడినట్లు అయ్యింది. ఒకే ఫీల్డుపై పూర్తి దృష్టి పెట్టి ఉంటే ఇలా రెండు చోట్ల దెబ్బయ్యే సిట్యువేషన్ ఉండేది కాదంటున్నారు. అయితే మంచు లక్ష్మి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టు మాత్రం ఇక్కడితో బ్రేక్ పడటం అనేది మాత్రం అసాధ్యం.

లక్ష్మి మాట్లాడుతూ... ''మంచి కథ అనిపిస్తే చాలు... డబ్బుల గురించి ఆలోచించకుండా వెళ్లి నటించి వచ్చేదాన్ని. ఇక నుంచి మాత్రం డబ్బులు తీసుకోవాలనుకొంటున్నా. ఎందుకంటే మా నాన్న ధనవంతుడు కానీ నేను కాదు. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తున్నా. నిర్మాతగా యువతరం అభిరుచులకు తగ్గ సినిమాలు తీస్తున్నా. 'గుండెల్లో గోదారి' చిత్రం నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తమిళంలో అంతగా ఆదరణ పొందలేదు కానీ... తెలుగులో మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపై నా నిర్మాణంలో మరిన్ని సినిమాలు వస్తాయి''.'' అన్నారు మంచు లక్ష్మీప్రసన్న.

హైదరాబాద్

'మోహన్‌బాబు కూతురేంటి? సినిమాల్లో నటించడమేమిటి?' అని చాలామంది అనుకొన్నారు. ఆ మాటలే నాకు సవాల్‌ విసిరాయి. 'ఎందుకు నటించకూడదు?' అనే పంతం వచ్చింది. ఇప్పుడు నందితో వారందరికీ సమాధానం చెప్పాననిపిస్తోంది. అందరిలా ఈ పురస్కారం ఎవరెవరికో అంకితం ఇవ్వదలుచుకోలేదు. ఇది నా నంది. నంది ఫలితాలు వెలుబడినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. చిన్నికృష్ణ గారు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ క్షణమే ఎగిరి గంతేయాలనిపించింది. అక్కడి నుంచి వరుసగా ఎన్ని ఫోన్లో. నిజంగానే ఎలా ప్రతిస్పందించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నారు.

అలాగే ప్రతినాయికగా అడుగుపెడితే.. జీవితాంతం ఆ ముద్రే పడిపోతుందేమో అని నిజంగానే భయపడ్డా. కానీ నాకు నేనే సర్దిచెప్పుకొన్నా. డిస్నీవాళ్ల సినిమా ఇది. అంత పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం ఎలా వదులుకో ను? నాన్నగారు కూడా మొదట్లో ఒప్పుకోలేదు. తరవాత ఆయనే ప్రోత్సహించారు. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని విజిల్స్‌ వేశారో. సినిమా పూర్తయ్యాక 'నీ నటనకు నా గులామ్‌..' అన్నారు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలెవరైనా భోజనం చేయకపోతే 'ఐరేంద్రీ వస్తుంది..' అని భయపెడితే గబగబా తినేస్తున్నారట. ఇలాంటివి వింటుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది. మొన్నీమధ్య సుస్మితాసేన్‌ 'అనగనగా ఓ ధీరుడు' డీవీడీ క్యాసెట్‌ అడిగి మరీ తీసుకెళ్లింది అంటూ ఆనందం వ్యక్తం చేసారామె.

English summary
Latest blow is that Lakshmi Manchu game show 'Doosukelta' that is being aired on Maa TV is also stopped now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu