For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg BossTelugu 5లో భార్గవ్.. నెట్ ఫ్లిక్స్ లో సినిమా అంటూ కీలక ప్రకటన?

  |

  ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారం కాబోతుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారికంగా కేవలం లోగో మాత్రమే విడుదల కాగా ఎప్పటి నుంచి ప్రసారమవుతుంది ? ఎవరెవరు ఆడుతున్నారు అనే విషయాల మీద ఏమాత్రం క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజుకు ఒక కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. వీళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు అంటూ అనేక మంది పేర్లు తెరమీదకు రాగా తాజాగా రేప్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన భార్గవ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  అలా స్టార్ గా

  అలా స్టార్ గా

  ఫన్ బకెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ తో నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన భార్గవ్ ఆ తరువాత ఫన్ బకెట్ భార్గవ్ గా దాదాపు అందరికీ పరిచయం అయ్యాడు.. తరువాత అక్కడ ఆదాయం తక్కువగా వస్తోందని టిక్ టాక్ వీడియోలు చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని విషయం తెలుసుకుని టిక్ టాక్ ప్రారంభించి కొద్ది కాలంలోనే టిక్ టాక్ స్టార్ గా అవతరించాడు. అయితే టిక్ టాక్ లో కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన భార్గవ్ అది బ్యాన్ కావడంతో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ ను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కొద్ది నెలల క్రితం భార్గవ్ ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఆమెను గర్భవతిని చేశాడని ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అరెస్టయి కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన భార్గవ ఈ మధ్యనే విడుదలై బయటకు వచ్చాడు..

  నమ్మడం లేదు

  నమ్మడం లేదు

  వచ్చిన తర్వాత 2,3 యూట్యూబ్ వీడియోలు విడుదల చేసి తాను నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు భార్గవ్. ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయం గురించి నేను ఏమీ మాట్లాడను అని కానీ నిజంగానే తప్పు చేసి ఉంటే ఇప్పుడు మీ ముందుకు ఇలా రాగలిగే వాడిని కానని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అలా చేసిన వీడియోలకు సైతం పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ సంగతి పక్కన పెడితే భార్గవ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే మరికొందరు మాత్రం భార్గవ్ ఈ షోకి వెళ్ళడం లేదని అంత పెద్ద కేసులో ఇరుక్కున్న వాడిని హౌస్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ షో కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఆగస్టు 15న బిగ్ బాస్ ప్రోమో విడుదల కాబోతోంది. ఆ ప్రోమోలో షో ఎప్పుడు మొదలు అవ్వబోతోంది అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా ఉందని అంటున్నారు.

  ఎదవ పనులు చేస్తుంటే

  ఎదవ పనులు చేస్తుంటే

  అయితే నిజానికి కొద్ది రోజుల క్రితం భార్గవ్ చేసిన ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దానికి కారణం తాను ఒక సినిమా చేస్తున్నానని అది ఓ టి టి లో విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని భార్గవ్ చెప్పుకొచ్చాడు.. నిజానికి వీడియో చేసింది మొదలు భార్గవ్ సపోర్ట్ చేయాలని కోరుతూ ఉండడంతో చాలామంది నువ్వు ఇలాంటి ఎదవ పనులు చేస్తుంటే మేము మీకు సపోర్ట్ చేయాలా అని ప్రశ్నించారు..

  సపోర్ట్ నా వీడియోలకు

  సపోర్ట్ నా వీడియోలకు

  దీనికి క్లారిటీగా ఒక వీడియో విడుదల చేసిన భార్గవ్ తాను సపోర్ట్ చేయమని కోరింది తాను చేసే వీడియోలనే కానీ తాను ఏదైతే కేసులో ఇరుక్కున్న ఆ కేసుకు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. నా అసలు పేరు చిప్పాడ భార్గవ్ అని కానీ ఫన్ బకెట్ భార్గవ్ అనే పేరు రావడానికి ఎంతో కష్టపడ్డా అని ఆయన చెప్పుకొచ్చాడు అంతేగాక ఇప్పుడు నడిపే ఛానల్ డబ్బులు కూడా తనకు ఒక్కడికే చెందవు అని తనను నమ్ముకుని చాలామంది ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.. సో ఇలా నెగిటివ్ కామెంట్లు పెట్టే ముందు కాస్త ఆలోచించాలి అని కూడా విజ్ఞప్తి చేశాడు.

  Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
  బిగ్ బాస్ + సినిమా

  బిగ్ బాస్ + సినిమా


  మరో విషయం ఏమిటంటే తాను దర్శకుడిని అవ్వాలనే కోరికతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టానని ఇన్నేళ్లకు అంటే దాదాపు ఐదేళ్ల తనకు దర్శకుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద తాను ఒక సినిమా చేస్తున్నానని అయితే ఆ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫిక్స్ ఇలా ఏదో ఒక దానిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.. తనకు ఇద్దరు మంచి నిర్మాతలు దొరికారని ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించాలని భావిస్తున్నానని కూడా భార్గవ్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఒకపక్క బిగ్ బాస్ వార్తలతో పాటు సినిమా వార్తలతో భార్గవ్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. మరి అతను నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళతాడా వెళితే ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది.

  English summary
  as per the latest buzz is that Fun Bucket Bhargav is going as a contestant into the Bigg Boss House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X