»   » సీరియల్ టైమ్ మార్చాలంటున్నారు

సీరియల్ టైమ్ మార్చాలంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ganga Tho Rambabu wanted to time Change
హైదరాబాద్ :రొటిన్ ఏడుపుగొట్టు సీరియల్స్‌, అత్తా కోడళ్ల గొడవలకు భిన్నంగా జీ తెలుగు చానల్‌లో ప్రతీరోజు ప్రసారమవుతున్న 'గంగతో రాంబాబు' కామెడీ సీరియల్ అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగే ఎపిసోడ్స్ గా కాకుండా చిన్న చిన్న విషయాలతో ప్రేక్షకులను నవ్వించేలా ఈ సీరియల్‌ను రూపొందించడం విశేషం. దాంతో ఇది అంతకు ముందు రోజు ఫాలో కానివారు కూడా ఫాలో అయ్యే అవకాసం ఉంది. అయితే ఈ సీరియల్ మరీ రాత్రి పదిన్నరకి ప్రసారం అవుతోంది. దాంతో చాలా మంది మిస్సవుతున్నారు. జీ తెలుగు వారు ఈ విషయం గమనించి టైమ్ మారిస్తే బాగుంటుంది అంటున్నారు.

టీవీ కళాకారుడైన రాంబాబు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరినీ విసిగించే అతని భార్య గంగ, తనకంటే అందమైన వారే లేరనుకునే ఓ సుందరి, ఏనాడు నల్లకోటు వేసుకోని ఒక ప్లీడరు, అందరినీ నవ్విస్తూ ఉండే ఓ రేడియో జాకీ, శ్రీకాకుళం యాసలో మురిపించే గంగ తమ్ముడు సత్తిపండు- ఇలా కేవలం ఐదు పాత్రలతో కడుపుబ్బ నవ్విస్తున్న ఈ సీరియల్‌కు అభిమానులు కూడా ఎక్కువే.

అమృతం తరువాత ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ పొందిన సీరియల్‌ గంగతో రాంబాబు. విశేషం ఏమిటంటే అమృతంలో పనివాడిగా నటించిన వాసు ఇంటూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జి తెలుగు ప్రతి రోజు వచ్చే ఈ షో ఆరుగురు చుట్టూనే ఈ సీరియల్‌ తిరుగుంది. గంగ, రాంబాబు, బిటీ, పితాని, సత్తి, లతిక అనే ఆరు క్యారెక్టర్లను ప్రధానంగా తీసుకుని వాసు ఇంటూరి అద్భుతంగా సీరియల్‌ను తీస్తున్నారు. మహిళలకే కాకుండా మగవారిని సైతం ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై నవ్వుల విందును పంచుతుంటారు.

అయితే, సీరియల్ రాత్రి పదిన్నరకు ప్రసారమవుతుండడంతో చాలామంది మిస్ అవుతున్నారట. జీ తెలుగు వారు ఈ విషయాన్ని గుర్తిస్తారో లేదో చూడాలి. గతంలో 'మై నేమ్ ఈజ్ మంగతాయారు', 'కృష్ణావతారాలు' వంటి హాస్య సీరియల్స్ అందించిన 'జీ తెలుగు' ఇలాంటి మరో కామెడీ సీరియల్ ఎంచుకోవడం అభినందించదగిందే.

English summary
Ganga Tho Rambabu ..A bedtime comedy entertainer for the entire family. Rambabu the lead character is an innocent TV artist aspiring to become a star. How he tackles his day to day issues with help of his wife Ganga is the story. The story moves on with the current Television topics with fun & satire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu