Don't Miss!
- Automobiles
కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!
- Finance
ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గంగవ్వ ఇంటికి భారీగా ఆర్థిక సహాయం.. నాగార్జున ఎన్ని లక్షల చెక్ పంపించారంటే!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగిసినప్పటికీ.. ఆ రియాలిటీ షోకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సీజన్ 4 సెన్సేషన్‌గా మారిన గంగవ్వపై క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా స్టార్ మా కట్టిస్తున్న గంగవ్వ ఇంటికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మీ కోసం..

బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి
బిగ్‌బాస్ చరిత్రలో 60 ఏళ్లకుపై బడిన కంటెస్టెంట్ గంగవ్వ రూపంలో రావడం అందర్ని ఆకట్టుకొన్నది. షోలో గంగవ్వ మాటలు, ప్రవర్తన, హావభవాలు, ఆలోచన తీరు, ఆటతీరు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దాంతో యూట్యూబ్‌లోనే కాకుండా బిగ్‌బాస్ ద్వారా కూడా భారీగా అభిమానులను గంగవ్వ సంపాదించుకొన్నది.

అన్యూహ్యంగా బిగ్‌బాస్ నుంచి బయటకు
అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో గంగవ్వ ప్రస్థానం జోరుగా సాగుతుండగా ఆమె అస్వస్థతకు గురికావడం అందర్ని షాక్ గురి చేసింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంి నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చారు. ఆ సమయంలో తనకు ఇంటిని కట్టించమని గంగవ్వ కోరగా స్టార్ మా నిర్వాహకులు అంగీకరించారు.

మొదలైన ఇంటి నిర్మాణం
ఇక బిగ్‌బాస్ 4 ఫైనల్ సందర్భంగా గంగవ్వ ఇంటి గురించి హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ముఖ్య అతిథి చిరంజీవితో మాట్లాడుతూ.. గంగవ్వ ఇంటి నిర్మాణం మొదలైంది. భూమిని చదును చేసి పనులు ప్రారంభించారు. త్వరలోనే గంగవ్వకు మంచి ఇల్లు రాబోతున్నదని పేర్కొన్నారు.

గంగవ్వ ప్రత్యేక ఆకర్షణగా
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరూ ఇటీవల ఉత్సవం పేరుతో అందరూ కలిశారు. శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఉత్సవంలో మళ్లీ గంగవ్వ ప్రత్యేక ఆకర్షణగా మారారు. తోటి కంటెస్టెంట్లందరూ గంగవ్వకు చీరెలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకొన్నారు.

అమ్మా రాజశేఖర్ 50 వేలు
అయితే అమ్మా రాజశేఖర్ మాత్రం ఓ అడుగు ముందేసి గంగవ్వకు ఆర్థిక సహాయం అందించారు. తాను ఇలా ఇవ్వాలని అనుకోలేదు. ఎవరికి తెలియకుండా అవ్వకు ఇవ్వాలనుకొన్నాను. కానీ ఇలా జరిగిపోయింది. గంగవ్వకు నా తరఫున 50 వేల రూపాయలు అందిస్తున్నాను. సహాయం విషయంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అమ్మా రాజశేఖర్ అన్నారు.

నాగార్జున 7 లక్షల చెక్‌తో సహాయం
ఇక బిగ్‌బాస్ ఉత్సవం వేదికపై గంగవ్వకు ఆర్థిక సహాయం అందిస్తూ నాగార్జున నిర్ణయం తీసుకొన్నారు. ఉత్సవానికి హాజరు కాలేకపోయిన నాగ్.. తన తరఫున రూ.7 లక్షల చెక్‌ను పంపించారు. ఈ ఉత్సవం వేదికపై గంగవ్వకు ఇంటి సభ్యులందరితోపాటు శ్రీముఖి ఆ చెక్‌ను అందించారు. దాంతో మరోసారి గంగవ్వ సంతోషంలో మునిగిపోయారు.