»   »  బిగ్ బాస్-7 విజేత గుహార్ ఖాన్

బిగ్ బాస్-7 విజేత గుహార్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మోడల్, నటి గుహార్ ఖాన్ కలర్స్ ఛానల్ లో ప్రసారం అవుతున్న వివాదాస్పద రియాల్టీ షో 'బిగ్ బాస్-7' విజేతగా నిలిచింది. ఆమెకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోపీని అందజేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ....ఈ విజయం సినీ పరిశ్రమలో తనకు స్టార్ డమ్ పెరగడానికి ఉపయోగ పడుతుందని, తన లక్ష్యం కూడా అదే అని తెలిపింది.

గుహార్ ఖాన్ గతంలో బాలీవుడ్ చిత్రాలు 'గేమ్', 'ఇష్క్ జాదే' చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్-7లో విజేతగా నిలవడం ద్వారా తనకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని గుహర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. మామూలు స్టార్ అని పిలిపించుకోవడం కంటే...సూపర్ స్టార్ అని పిలిపించుకోవడంలో డిఫరెంటు ఫీలింగ్ ఉందని ఆమె తెలిపారు.

Gauhar Khan wins 'Bigg Boss 7'

బిగ్ బాస్ రియాల్టీ షోలో మహిళ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. బిగ్ బాస్ 4, 5, 6 సీజన్లలో శ్వేతా తివారీ, జుహి పరమార్, ఉశ్వశి ధోలకియా బిగ్ బాస్ ప్రైజ్ ను ఎగరేసుకెళ్లారు. ఇపుడు బిగ్ బాస్ 7 కూడా మహిళకే దక్కడం గమనార్హం.

చివరి రౌండ్లో గుహర్ ఖాన్, తానిషా ముఖర్జీ మధ్య రసవత్తరమైన పోటీ సాగింది. వారిద్దరి మదర్స్ కూడా బిగ్ బాస్ వేదిక వద్దకు చేరుకుని సపోర్టుగా నిలిచారు. అయితే అన్ని రౌండ్లోనూ గుహర్ ఖాన్ పై చేయి సాధించి విజేతగా నిలిచింది. సల్మాన్ ఖాన్, కంటెస్టెంట్స్ ఎంటర్టెన్మెంట్ షోతో చివరి ఎపిసోడ్ సందడిగా సాగింది

English summary
Model-turned-actress Gauhar Khan Saturday won the seventh season of "Bigg Boss" and took home the prize money of Rs.50 lakh and the trophy. She said now her aim is to attain superstardom in showbiz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu