»   » ఆయనకు 40.. ఆమెకు 20.. పెళ్లి కన్ఫర్మ్.. షాహీద్ కపూర్ దారిలో..

ఆయనకు 40.. ఆమెకు 20.. పెళ్లి కన్ఫర్మ్.. షాహీద్ కపూర్ దారిలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమలో పీకల్లోతు మునిగిన జంటకు వయసుతో సంబంధమేమీ ఉండదు. చాలా ప్రముఖుల ప్రేమ వ్యవహారాల్లో ఇది నిజమైంది. తన కంటే సగం వయస్సు ఉన్న ప్రేమికురాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నటుడు గౌతమ్ రోడ్ వ్యవహారం ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో చర్చానీయాంశమైంది. తాజాగా తమిళంలో 60 ఏళ్ల దర్శకుడు తన కంటే 30 ఏళ్లు చిన్నదైన హీరోయిన్ పెళ్లి చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమ్ పెళ్లి కూడా మీడియాకు ఎక్కడం గమనార్హం.

ప్రేమ జంటకు 20 ఏళ్ల తేడా

ప్రేమ జంటకు 20 ఏళ్ల తేడా

టెలివిజన్ రంగంలో అక్సర్2 అనే సీరియల్ ద్వారా గౌతమ్ రోడ్ సుపరిచితుడు. అలాగే క్యా కసూర్ హై ఆమ్లా కా నటి పంఖూరీ అవస్తీ మంచి నటిగా గుర్తింపు ఉంది. 20 ఏళ్ల అవస్తీతో 40 ఏళ్ల వయస్సు ఉన్న గౌతమ్‌ను సూర్యపుత్ర కర్ణ అనే సీరియల్ కలిపింది. అప్పటి నుంచి ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ఇష్టం కలిగింది. గత కొద్దికాలంగా వారిద్దరూ మధ్య అఫైర్ కొనసాగుతున్నది.

ఇంటిని కూడా మార్చిన..

ఇంటిని కూడా మార్చిన..

అవస్తీ మరింత చేరువయ్యేందకు ఇటీవల గౌతమ్ ఇంటిని కూడా మార్చాడట. అవస్తీ ఇంటికి సమీపంలోనే మరో ఇంటిని తీసుకొన్నాడనే తాజా సమాచారం. అలా దగ్గరైన వారిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకొన్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గతంలో పలువురితో అఫైర్..

గతంలో పలువురితో అఫైర్..

గతంలో గౌతమ్ రోడ్‌ తన సహచర తారలతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సరస్వతిచంద్ర సమయంలో జెన్నీఫర్ వింగెట్‌తోను... మహాకుంభ్ షూటింగ్ సమయంలో శ్రద్ధ ఆర్యతో అఫైర్ ఉందంటూ మీడియా కోడై కూసింది. ఇలా తాను నటించే ప్రతీ సీరియల్‌లోను మరొకరితో సంబంధం ఉన్నట్టు వార్తలు రావడం గౌతమ్ కొత్తేమీ కాదు.

షాహీద్ కపూర్ చేసుకోలేదా..

షాహీద్ కపూర్ చేసుకోలేదా..

తాజాగా తన కంటే 20 ఏళ్లు చిన్నదైన అవస్తీతో అఫైర్ కొద్దికాలంగా నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వారిద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. తాజాగా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు అనేది సమాచారం. వయసు తేడా గురించి ప్రస్తావించగా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్‌ను పెళ్లిని చూపిస్తున్నారట. తనకంటే 13 ఏళ్ల తక్కువ వయసు ఉన్న మీరాను షాహిద్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Age is certainly no bar, when bitten by the love bug! If Shahid Kapoor can marry Mira who is 13 years younger to him, than why can't TV's eternal bachelor Gautam Rode. Aksar 2 star is planning to settle down with Kya Qasur Hai Amla Ka actress, Pankhuri Awasthy. Reports says that, the 40 year old actor has proposed marriage to Pankhuri who is in her mid 20s The two met on the sets of Suryaputra Karna and have managed to keep their relationship a secret till now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu