బిగ్‌బాస్ ఒక రంకు షో... నాగార్జునవి అలాంటి యవ్వారాలే.. టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
జనానికి వినోదాన్ని పంచడంతో పాటు వివాదాల్లోనూ అంతే పేరు తెచ్చుకుంది బిగ్‌బాస్ రియాలిటీ షో. ఆదరణ, టీఆర్పీ రేటింగ్స్, స్టార్ డమ్ ప్రకారం చూసుకుంటే బిగ్‌బాస్‌కు దరిదాపుల్లో ఏ టీవీ కార్యక్రమం కూడా ఉండదు. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొంటే చాటు బోల్డెంత పాపులారిటీ. నగరాలు, అర్బన్ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు కూడా బిగ్‌బాస్ చొచ్చుకెళ్లిపోయింది. సాయంత్రం ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయేంతగా ఈ షో క్రేజ్ సంపాదించుకుంది. అయిదే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. లెక్కలేనన్ని వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టుల్లో విచారణ, రాజకీయ నాయకులతో పాటు సాంప్రదాయవాదుల అభ్యంతరాలతో చెడ్డపేరును కూడా అంతే మూటకట్టుకుంది బిగ్‌బాస్.
బిగ్‌బాస్‌ను బ్రోతల్ హౌస్ అన్న నారాయణ
తొలుత హిందీలో ప్రారంభమై ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ రియాలిటీ షో అడుగుపెట్టింది. సస్పెన్స్, మైండ్ గేమ్, గ్లామర్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండటంతో బిగ్‌బాస్ కాన్సెప్ట్‌గా చిన్నారుల నుంచి పెద్దల వరకు కనెక్ట్ అయిపోయారు. అయితే పెళ్లి కానీ వారిని, పెళ్లయిన వారిని ఒకే గదిలో కొన్నిరోజులు పాటు ఉంచడం అశ్లీలత, ముద్దులు వంటి వాటిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఇక సీపీఐ సీనియర్ నేత నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో పల్లవి ప్రశాంత్ విధ్వంసం
ఇక ఇటీవల పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారంటూ కర్ణాటక ప్రభుత్వం కన్నడ బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేయించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీని మాదిరిగానే మిగిలిన భాషల్లోని బిగ్‌బాస్ హౌస్‌లను కూడా నిషేధించాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి. అటు తెలుగు బిగ్‌బాస్‌కు కూడా వివాదాలు కొత్తేం కాదు.. కంటెస్టెంట్స్ తీరుతో పాటు గతంలో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంతి అభిమానులు హైదరాబాద్‌లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
కంటెస్టెంట్స్‌గా మాధురి, రీతూలు వద్దు
తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9ని నిషేధించాలంటూ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని గజ్వేల్‌కు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాజంలో సరైన విలువలు లేని దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చి ఇలాంటి వారితో ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. హోస్ట్ అక్కినేని నాగార్జునపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బిగ్‌బాస్‌ను నిషేధించని పక్షంలో ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని వారు వార్నింగ్ ఇచ్చారు.
బిగ్‌బాస్ ఓ రంకు షో
తాజాగా బిగ్‌బాస్ తెలుగు నడుస్తున్న తీరుపై సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది ఓ రంకు షో, ఈసారి అందరూ తిడుతున్నారు. ఎంత తిడితే అంత ఆరోగ్యం దానికి అంటూ మండిపడ్డారు. మరి ఇలాంటి నాగార్జున గారు సిరీస్ వైజ్‌గా ఆయనే హోస్ట్‌గా ఉంటున్నారని యాంకర్ ప్రశ్నించగా.. అతను కూడా ఆ టైప్ ఏమోనంటూ ఎవడికి తెలుసు అంటూ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ టైప్ ఇమేజ్ ఉన్నవాళ్లని హోస్ట్‌లుగా పెడతారు.. ఏం ఇమేజ్ ఉంది.. అమ్మాయిల్ని, హీరోయిన్లను వాడుకుంటాడు.. ఈ వయసులోనూ మన్మథుడు అనే ఇమేజ్ ఉంది కదా. ఇవన్నీ మామూలే.. ప్రవచనాలు చెప్పుకునే వ్యక్తి కాదు కదా.. నాగార్జునే కదా. టబు, రమ్యకృష్ణ అదీ ఇది అంటూ పలువురు హీరోయిన్ల పేర్లను కూడా గీతాకృష్ణ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై నాగార్జున, బిగ్‌బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











