twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లెజెండ్‌' శాటిలైట్ రైట్స్ ఆ ఛానెల్ కే

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుని రెండు రోజుల్లో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో రైట్స్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. జెమినీ ఛానెల్ వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకునట్లు వినికిడి. అయితే మొదట ఎనిమిదిన్నర కోట్లు పలికిన ఈ రైట్స్ ...ట్రాయ్ నిబంధనల మేరకు ఛానెల్స్ లో యాడ్ లు ఇచ్చే సమయం తగ్గటంతో ఐదున్నర మాత్రమే ఇచ్చినట్లు చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు.

    కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గంటలో 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలనే ప్రతిపాదనల కారణంగా....ముందు 7 కోట్లు ఇస్తామని చెప్పిన జెమినీ టీవీ వెనక్కి తగ్గిందని, ఈ పరిణామాల నేపథ్యంలో మాటీవీ వారు కూడా తమ రేటు తగ్గించి రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. దాంతో జెమెనీ టీవీ ఓ అడుగు ముందుకేసి ఈ రైట్స్ ని సాధించినట్లు తెలుస్తోంది.

     Gemini bags Balakrishna's Legend satellite rights

    బాలయ్య అభిమానులు పండగ చేసుకునే విధంగా రూపొందిందని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి. నైజాం రైట్స్ ని మల్టీ డైమన్షన్స్ వారు 7.5 కోట్లు ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారు. అలాగే సీడెడ్ రైట్స్ ఏడు కోట్లుకి, గుంటూరు రైట్స్ 3.6 కోట్లుకు, నెల్లూరు రైట్స్ 1.6 కోట్లు వరకూ పలికాయని టాక్. ఓవరాల్ థియోటకల్ రైట్స్ 38- 40 వరకూ వెళ్లాయని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ తొమ్మిది నుంచి పదికోట్లు వరకూ ఉన్నాయి. 35 కోట్లుతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు చేరుతుందని సమాచారం.

    నిర్మాత మాట్లాడుతూ... ''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

    ''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

    పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

    English summary
    Legend directed by Boyapati Srinu is racing for release on March 28th. According to the latest the film's satellite rights are bagged by Gemini for a fancy rate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X