Just In
- just now
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 15 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- News
రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్
- Finance
టాప్ 100 కుబేరుల సంపద రూ.13.8 లక్షల కోట్లు జంప్, దేశంలోని పేదలకు రూ.94వేల చొప్పున ఇవ్వొచ్చు
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంతకి...ఎవరికి? : ‘టెంపర్’ శాటిలైట్ అమ్మారు
హైదరాబాద్ : బాక్సాఫీసు దగ్గర వసూళ్ల దండయాత్ర చేస్తూ తన 'టెంపర్' చూపిస్తున్నాడు ఎన్టీఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చక్కటి ఫలితాన్ని రాబట్టింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని అమ్మటం జరిగింది. జెమినీ చానెల్ వారు 7.50 కోట్లు చెల్లించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. దాంతో ఈ చిత్రం నిర్మాత, యూనిట్ ఆనందోత్సాహాల్లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ చిత్రానికి ఛానెల్స్ పోటీ పడి ఈ రేట్ ని పే చేయటం విశేషంగా పేర్కొంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మరో ప్రక్క 'ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపిస్తున్నాడ'అంటూ అభిమానులు సంబర పడిపోతున్నారు. దయాగా ఎన్టీఆర్ నటన బాగుందంటూ సినీ ప్రముఖులు కితాబులు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు దయ మళ్లీ రాబోతున్నాడు. విషయమేంటంటే.. 'టెంపర్' సీక్వెల్ తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ అధికారికంగా ధ్రువీకరించారు కూడా.

''ప్రస్తుతం 'టెంపర్' అందించిన విజయానందంలో ఉన్నాం. ఈ చిత్రం ఇచ్చిన నమ్మకంతో సీక్వెల్‌కూ రంగం సిద్ధం చేస్తున్నాం. మా టీమ్ మళ్లీ ఓ మంచి సినిమా అందివ్వబోతోంది'' అని చిత్ర బృందం చెబుతోంది. ఎన్టీఆర్ రాబోయే చిత్రాల జాబితాలో 'టెంపర్ 2' కూడా చేరిపోయిందన్నమాట.
ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.
ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్ కొట్టారు.

ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. రూ. 10.75 కోట్ల వసూళ్లతో ‘అత్తారింటికి దారేది' చిత్రం మొదటి స్థానంలో ఉండగదా, రూ. 9.74 కోట్లతో ‘దూకుడు' రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ‘టెంపర్' మూవీ దాదాపు 22 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి
టెంపర్ కథేమిటంటే...
వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.