twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫు సినిమాకూ అంత రేటు పెట్టి ఛానెల్ వాళ్లు...

    By Srikanya
    |

    హైదరాబాద్ : కాస్త పేరున్న హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే సినిమా ఫ్లాపు అయినా దాని డబ్బులు ఏదో విధంగా వచ్చే అవకాసం ఉందని మరో సారి ప్రూవ్ అయ్యింది. క్రేజీ ప్రాజెక్టు ఫ్లాఫ్ అయినా శాటిలైట్ పరంగా మంచి రేటే పలికే అవకాసం ఉంది. తాజాగా మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ చిత్రం శాటీలైట్ రైట్స్ నాలుగు కోట్లు పలికి అందరిని ఆశ్చర్యపరిచింది. జెమినీ టెలివిజన్ వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

    Gemini TV grabs Current Teega's satellite rights

    చిత్రం కథేమిటంటే...

    చదువుకుని ఆవారాగా తిరిగే రాజు(మంచు మనోజ్) తన ఊళ్లో ఉండే లెక్చరర్ సన్ని (సన్నిలియోన్)కి లైన్ వేస్తూంటాడు. అందుకోసం అదే కాలేజీలో చదువుతూ సన్ని స్టూడెంట్ అయిన కవిత(రకుల్ ప్రీతి సింగ్)ని కొరియర్ లాగ వాడుకోవాలని చూస్తాడు. అయితే సన్ని ఓ రోజు తన వెడ్డింగ్ కార్డుతో షాక్ ఇస్తే నిరాశపడిన అతనికి కవిత రూపంలో అతనికి నిజమైన ప్రేమ కనిపిస్తుంది. ఆమె వెనక పడి ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అంతేకాక అప్పటికే సెటిలైన ఆమెకు ఇష్టంలేని వివాహం చెడకొట్టి...ఆమెని పడేస్తాడు. అయితే కవిత తండ్రి, ఆ ఊరి పెద్ద మనిషి, ఎప్పుడూ తుపాకి పట్టుకుని తిరిగే... శివరామరాజు(జగపతిబాబు)కు రాజు అంటే పడదు. తన కూతురుని రాజు ప్రేమలో పడిందని తెలిసిన శివరామరాజు ఎలా రియాక్టయాడు...రాజు అప్పుడేం చేసి తన ప్రేమను గెలిపించుకున్నాడనేది మిగతా కథ.

    మంచు మనోజ్ మాట్లాడుతూ....మంచి కథ కోసం అన్వేషిస్తుంటే ‘వరుత్తపడాద వాలిబర్‌ సంగం' గురించి చెప్పారు. నేను కూడా సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. తెలుగులో తిరుమల కిశోర్‌ డైలాగులు రాశాడు. ప్రతి సీనుకూ రెండు, మూడు పంచ్‌లు తప్పకుండా పడ్డాయి. రాయలసీమ యాసలో ఎక్కువగా సినిమా సాగింది. ముఖ్యంగా తిరుపతి పరిసరాలను ప్రతిబింబించే సినిమా ఇది.'' అన్నారు.

    అలాగే...''పక్కా వాణిజ్య చిత్రం 'కరెంట్‌ తీగ'. తమిళ చిత్రానికి రీమేక్‌ అయినా కథలో మార్పులు చేశాం. సన్నివేశాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. జగపతిబాబు పాత్ర ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ఆయన్ని ఈ సినిమాతో జగ్గూభాయ్‌ని చేశాం. కథ చెప్పగానే పారితోషికం గురించి కూడా ఆలోచించకుండా 'నేను ఈ సినిమా చేస్తా' అనేశారు. ఇప్పటి వరకూ నాతో నటించిన కథానాయికల్లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అత్యుత్తమం. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు నేర్చుకొని మరీ డైలాగులు చెప్పింది. తప్పకుండా తనకు మంచి భవిష్యత్తు ఉంది'' అన్నారు.

    బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
    నటీనటులు: మంచు మనోజ్, రకుల్ ప్రీతి సింగ్, సన్నిలియోన్, జగపతిబాబు, సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు
    కెమెరా: సతీష్ ముత్యాల,
    మాటలు:కిశోర్ తిరుమల,
    ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్,
    పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి,
    నిర్మాత:విష్ణు మంచు,
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.
    సమర్పణ: డా.ఎమ్.మోహన్ బాబు

    English summary
    Manchu Manoj , Rakul Preet and Sunny Leone starrer latest entertainer Current Teega movie satellite rights were picked up by Gemini Television for amount of 4 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X