twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరినీ కూర్చోబెట్టి బాగా తిడతారు, కానీ..: నాగబాబు వ్యక్తిత్వం గురించి గెటప్ శ్రీను

    |

    మేము ఎలా ఉన్నా, ఎంత సంపాదించినా... మోరల్ వాల్యూస్, సామాజిక స్పృహతో బ్రతికే విధంగా మమ్మల్ని మార్చింది నాగబాబు గారే అని బజర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తెలిపారు. జబర్దస్త్ ఆర్టిస్టులందరిలో ఇలాంటి భావజాలం పెంపొందడానికి నాగబాబు కారణమని తెలిపారు. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను... మెగాబ్రదర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    నొప్పించే పంచులు వేస్తే మందలిస్తారు

    నొప్పించే పంచులు వేస్తే మందలిస్తారు

    ఏదో సంపాదిస్తున్నాం అని కాలం గడిపే వ్యక్తిత్వాలు మావి. ఆయన పిలిచి... ఇలాంటి పంచులు వద్దు, ఎవరినీ నొప్పించే విధంగా స్కిట్లు ఉండొద్దు, మంచి కామెడీ చేయండి అని చెబుతారు. ఎప్పుడైనా కామెడీ తగ్గినా కొన్ని రోజులు ఓపికగా చూస్తారు. వెంటనే ఓ మాట అనేసి హర్ట్ చేయడం బాగోదులే అని ఆలోచిస్తారని గెటప్ శ్రీను వెల్లడించారు.

    అందరి గురించిన కాలిక్యులేషన్స్ ఉంటాయి

    అందరి గురించిన కాలిక్యులేషన్స్ ఉంటాయి

    నాగబాబు గారి వద్ద ప్రతి ఆర్టిస్టు, ప్రతి టీమ్ గురించి వంద పేజీల కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎవరి కెపాసిటీ ఎంత? ఎవరు ఏం చేయగలరు? ఎవరు ఏ స్థాయిలో ఆలోచిస్తారు? ఆ కామెడీ ఏ రేంజిలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అని లెక్కలేస్తారు. మేము కామెడీ సరిగా చేయకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఎక్కువ చేయాలి, మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెబుతారు. ఇంకో టీమ్ కు ఇంకో రకంగా చెబుతారు. మీటీమ్ ఇలా చేయాలి కదా అలా ఎందుకు చేశారని మందలిస్తారని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

    ముందు తిట్లు పెడతారు, ఆ తర్వాత భోజనం పెడతారు

    ముందు తిట్లు పెడతారు, ఆ తర్వాత భోజనం పెడతారు

    ఏ టీమ్‌లో కామెడీ లోపించినా, ఏమైనా తేడా కనిపించినా నాగబాబు గారు వెంటనే పిలుస్తారు... మాట్లాడతారు. మనది సౌతిండియాలో నెం.1 షో, ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్న షో, మీరు లైట్ తీసుకుంటున్నారు. కోట్ల మంది చూసే షోను ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అని ముందు గట్టిగా తిట్లు పెడతారు, తర్వాత భోజనం పెడతారు. ఇంటి దగ్గర నుంచి చికెన్, మటన్, ఎండు చేపలు, బిర్యానీ వండించి తెప్పిస్తారని గెటప్ శ్రీను వెల్లడించారు.

    నాకు గురువు కంటే ఎక్కువ

    నాకు గురువు కంటే ఎక్కువ

    మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎంత మేరకు పది మందితో మాట్లాడాలి అనేది చెబుతారు. ఎప్పుడూ నెగెటివ్‌గా ఆలోచిస్తూ లైఫ్ అయిపోయింది ఇంకేం ఉండదు అనే విధంగా ఉండొద్దు అని చెబుతారు. హ్యాపీగా ఉండండి, అందరితో మాట్లాడండి అని సూచిస్తూ ఉంటారు. అందుకే నాగబాబు గారు నాకు గురువు కంటే ఎక్కువ. మేము కాస్త ఒళ్లు చేసినా ఇలా ఉన్నారేంటి? డైట్ చేయండి, ఎక్సర్ సైజ్ చేయండి అని చెబుతారు.... అంటూ నాగబాబు వ్యక్తిత్వం గురించి గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

    English summary
    Getup Seenu about Naga babu behavior. Konidela Nagendra Babu is an Indian, Telugu film actor and producer. He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X