Jabardasth:మా టీమ్ లో కూడా గొడవలు జరుగుతాయి.. కానీ ఆ భయంతో ఇప్పటికి విడిపోలేదు: గెటప్ శ్రీను

జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అనేక రకాల మార్పులు వచ్చాయి. టెలివిజన్ కామెడీ షోలతో గత 8ఏళ్లుగా టాప్ రేటింగ్స్ అందుకుంటున్న జబర్దస్త్ కు పోటీగా ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ రాలేదు. ఇక అందులో ఉన్న వాళ్ళు కొందరు ఇంకా బయటకు రావడం లేదు. ఇక టీమ్స్ కూడా చాలానే డివైడ్ అవుతున్నాయి. అయితే సుడిగాలి సుధీర్ టీమ్ మాత్రం అస్సలు విడిపోలేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో - గెటప్ శ్రీను ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

 జబర్దస్త్ లో రాజకీయాలు

జబర్దస్త్ లో రాజకీయాలు

2013లో ఒక నార్మల్ షోగా మొదలైన జబర్దస్త్ చాలా తక్కువ కాలంలోనే టాప్ షోగా స్థానాన్ని అందుకుంది. ఇక అందులో మొదట ధన్ రాజ్ - వేణు - చాలాకి చంటి వంటి సీనియర్ కమెడియన్స్ మంచి గుర్తింపు అందుకొని ఆ తరువాత సినిమా కోసం బయటకు వచ్చేశారు. మరికొందరు షోలో రాజకీయాల వలన కూడా బయటకు వచ్చేసినట్లు చెబుతుంటారు.

షోలో నెంబర్ వన్ టీమ్

షోలో నెంబర్ వన్ టీమ్

అయితే ఎవరు ఉన్నా లేకపోయినా కూడా చాలా కాలంగా జబర్దస్త్ లో కొందరు అలానే కొనసాగుతున్నారు. అందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను బెస్ట్ కాంబినేషన్ గా హైలెట్ అవుతున్నారు. ఇక వారికి ఆటో రామ్ ప్రసాద్ తోడైన అనంతరం షోలో నెంబర్ వన్ టీమ్ గా క్రేజ్ అందుకుంటున్నారు.

 గొడవలు అవుతుంటాయి

గొడవలు అవుతుంటాయి

అయితే సాధారణంగా ఒక టీమ్ లో ఉంటే గొడవలు జరగడం సహజం. గోడవలతో విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - ఆటో రామ్ ప్రసాద్ మాత్రం విడిపోకుండా అలానే ఉన్నారు. అలాగని వారి మధ్య గొడవలు జరగకుండా ఉండవట. అప్పుడప్పుడు అవుతుంటాయట. విడిపోకపోవడానికి భయం కూడా ఉందని ఒక ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను వివరణ ఇచ్చారు.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
 అందరికి నచ్చేలా కలిసి ఉండాలి

అందరికి నచ్చేలా కలిసి ఉండాలి

గెటప్ శ్రీను మాట్లాడుతూ.. మేము ఎక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్లినా కూడా చాలామంది కమెడియన్స్ కంటెస్టెంట్స్ మమ్మల్ని చూసి ఆనందపడతారు. ఎవరు మీలాగా కలిసి ఉండరు. స్ఫూర్తిగా ఉందని అంటుంటారు. దీంతో మాలో కాస్త బాధ్యత భయం రెండు కలుగుతాయి. అందరికి నచ్చేలా కలిసి ఉండాలి అని శ్రీను తెలిపాడు.

 మరో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా

మరో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా

ఇక మా ముగ్గురి మధ్య కూడా గొడవలు జరుగుతాయని అంటూ కాకపోతే మాలో మేమే ఎక్కువగా పోట్లాడుకుంటూ మరో వ్యక్తికి తిట్టే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటామని చెప్పాడు. సన్నీ కూడా ఎప్పటి నుంచో మాతో కలిసి ఉన్నాడని అతనికి డైలాగ్ లేకుండా ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా చేస్తాడు గాని అస్సలు ఫీల్ అవ్వడాని శ్రీను వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X