»   » బిగ్‌బాస్ ఇంటిలో దొంగతనం.. గొలుసుతో పట్టుబడ్డ మహేశ్ కత్తి అరెస్ట్!

బిగ్‌బాస్ ఇంటిలో దొంగతనం.. గొలుసుతో పట్టుబడ్డ మహేశ్ కత్తి అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ముమైత్ ఖాన్ వెళ్లిపోవడంతో సెలబ్రీటలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బిగ్‌బాస్ కాంపౌండ్ అంతా నిశ్శబ్దంగా మారింది. ఎందుకిలా జరిగింది? ముమైత్‌ను బయటకు ఎందుకు పంపించారు అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. ముమైత్ బయటకు ఎందుకు వెళ్లిందనే విషయంపై ధన్‌రాజ్, సమీర్ సరైన అంచనాకు వచ్చారు. నోటీసుల వచ్చినందునే బయటకు వెళ్లిందని వారందరూ నిర్దారణకు వచ్చారు. అలా అయితే ముమైత్ వెళ్లడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇంటిలో ఊహించని ఘటన చోటుచేసుకొన్నది. దొంగతనం చేసిన మహేశ్ కత్తి అరెస్ట్ అయ్యాడు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి

ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి

ముమైత్ సడన్‌గా నిష్క్రమించిన బాధ నుంచి తేరుకోవడానికి ఇంటి సభ్యులు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. వెంటనే వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. మధ్నాహ్నం వేళ బిగ్ బాస్ ఓ లేఖను పంపారు. ఇంటిలో వినోద కార్యక్రమాన్ని నిర్వహించాలి అని సూచిస్తాడు బిగ్‌బాస్.

Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
శివగామిగా కల్పన.. భర్తగా ఆదర్శ్

శివగామిగా కల్పన.. భర్తగా ఆదర్శ్

శివగామిగా కల్పన, నవాబుగా ఆదర్శ్, కాలకేయగా ప్రిన్స్, కట్టప్పగా కత్తి మహేశ్, కిల్‌బిల్ పాండేగా సమీర్, డాక్టర్ బాలీగా ధన్‌రాజ్, శృంగార తారగా హరితేజ నటించాలి అని బిగ్‌బాస్ ఆదేశించారు. బాగా నటించిన వారికి ఉత్తమ నటీనటుల అవార్డులను అందజేస్తామని చెప్పారు.

ఆకట్టుకొన్న వేషధారణ

ఆకట్టుకొన్న వేషధారణ

ఇంటి సభ్యులు నిర్వహించే కార్యక్రమం పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ పంథాలో సాగాలి. వేషధారణ కోసం ఆయా సభ్యులు వారి వారి వస్తువులను ఉపయోగించుకోవాలి అని సెలబ్రిటీలకు బిగ్‌బాస్ సూచించారు. శివగామి వేషంలో కల్పన, నవాబుగా ఆదర్శ్, కట్టప్పగా మహేశ్ కత్తి, కాలకేయగా ప్రిన్స్, కిల్ బిల్ పాండేగా సమీర్ వేషధారణ చాలా ఆకట్టుకొన్నాయి.

శివగామి గొలుసు దొంగిలించిన కత్తి

శివగామి గొలుసు దొంగిలించిన కత్తి

శివగామి కల్పన, ఆమె భర్త నవాబుగా ఆదర్శ్‌లు తమ ఆస్థానంలో కూర్చొని ఉన్నారు. కట్టప్ప పాత్రలో అంగరక్షకుడిగా శివగామి వెనుక నిలుచున్న కత్తి మహేశ్ ఆమె మెడ నుంచి చాకచక్యంగా గొలుసును దొంగిలించాడు. అప్పుడు పక్కనే ఉన్న సైనికుడు శివబాలాజీ గమనించి పట్టుకొన్నాడు. వెంటనే ఆ సొమ్ములో నీకు భాగం ఉంటుంది అని సైగ చేయడంతో శివబాలాజీ చూసి చూడనట్టు వ్యవహరిస్తారు.

కిల్‌బిల్ పాండే ఎంట్రీ

కిల్‌బిల్ పాండే ఎంట్రీ

ఆ తర్వాత తన గొలుసు పోయింది అని ఫిర్యాదు చేయడంతో దొంగను పట్టుకోవడానికి వెంటనే పోలీస్ అధికారి కిల్‌బిల్ పాండేను ఆస్థానంలోకి రప్పిస్తారు. రాజసౌధంలో ఉన్న ప్రతీ ఒక్కరిని సోదా చేయడంతో చివరికి కట్టప్ప మహేశ్ కత్తి వద్ద దొరుకుతుంది.

మహేశ్ కత్తి అరెస్ట్

మహేశ్ కత్తి అరెస్ట్

దాంతో నమ్మిన బంటువని అనుకుంటే నీవే గొలుసును దొంగిలిస్తావా అని శివగామి కల్పన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దొంగతనం ఎందుకు చేశావని ప్రశ్నించడంతో కట్టప్ప సమాధానం చెపుతూ.. నేను ఈ దొంగతనం చేశానో తెలుసుకోవాలంటే బిగ్‌బాస్2 వరకు ఆగాల్సిందే అంటాడు. చివరికి శివగామి ఆదేశాలతో మహేశ్ కత్తిని అరెస్ట్ చేస్తారు. దాంతో నాటకం ముగుస్తుంది. ఈ నాటకంలో శివగామి పలికిన నా మాటే శాసనం అనే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.

వీకెండ్ పార్టీ ఏర్పాటు చేయండి

వీకెండ్ పార్టీ ఏర్పాటు చేయండి

ఈ నాటకంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శివగామి పాత్రధారి కల్పన, నవాబు ఆదర్శ్ బాలకృష్ణ ఉత్తమ నటులుగా ఎంపిక చేయాలని ధన్‌రాజ్, కత్తి కార్తీక బిగ్‌బాస్‌కు సూచించారు. అలాగే వారాంతంలో మంచి పార్టీ అరెంజ్ చేయాలి అని బిగ్‌బాస్‌ను కోరారు.

English summary
Telugu Version of Bigboss started with High Energy. But it is going so so affair. Already Sampoo gone out on Tuesday and Mumaith is ready for elemination. There are unnecessory, Unexpected things are happening in the reality show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu